Site icon Prime9

Chhattisgarh Encounter: చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. 8 మంది నక్సల్స్‌ మృతి

Chhattisgarh Encounter

Chhattisgarh Encounter

Chhattisgarh Encounter: చత్తీస్‌గఢ్‌లో మారోమారు భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. శనివారం నాడు నారాయణపూర్‌ జిల్లాలో అభుజమార్హా లో భద్రతాదళాలకు.. నక్సల్స్‌ మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక సైనికుడితో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా గత రెండు రోజుల నుంచి నారాయణపూర్‌ జిల్లాలోని మాడ్‌ ఏరియాలో నక్సల్స్‌కు భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని జిల్లా అధికారులు తెలిపారు.

భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్.. (Chhattisgarh Encounter)

కాగా నారాయణపూర్‌ – కొండాగౌవ్‌ – కాంకేర్‌ – దంతేవాడ డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌, ఐటీబీపీ 53వ బెటాలియన్‌ దళాలు కలిసి సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించారు. కాగా భద్రతా దళాలు మాత్రం నక్సల్స్‌ ఏరివేత కార్యక్రమం తీవ్రతరం చేశారు. రెడ్‌ కారిడార్స్‌లో యాంటీ నక్సల్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టారు. గత నెలలో భద్రతా దళాలు బైజాపూర్‌ జిల్లాలోని అడవుల్లో 12 మంది నక్సలైట్లను మట్టుపెట్టారు. ఇరు వర్గాల మధ్య పోరు దీర్ఘకాలం పాటు కొనసాగింది. నక్సల్స్‌ కోసం గాలింపు మొదలుపెట్టగానే గంగాలూర్‌ రీజియన్‌లోని పీడియా గ్రామం వద్ద నక్సలైట్లు భద్రతా దళాలపై కాల్పులు ప్రారంభించారు. ఈ ఎదురు కాల్పుల్లో 12 మంది నక్సల్స్‌ ప్రాణాలు కోల్పోయారు. సుమారు 11 గంటల పాటు ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఎనౌకౌంటర్‌ విజయవంతంగా పూర్తి చేసినందుకు ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయి భద్రతా దళాలను అభినిందించారు.

ఇక చత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి భద్రతా దళాలు నక్సల్స్‌ ఏరివేత కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు హోంమంత్రి అమిత్‌ షా కూడా రాష్ర్టంలో నక్సలిజంను అంతం చేసి ప్రజలకు డబుల్‌ ఇంజిన్ ఫలాలు అందజేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు . ఏప్రిల్‌ 16న భద్రతా దళాలు కాంకేర్‌జిల్లాలో 29 మంది నక్సలైట్లను అంతం చేశారు. నారాయణపూర్‌ జిల్లాలోని అభుజమార్హా రీజియన్‌లో పది మంది నక్సలైట్లను తుద ముట్టించారు. మొత్తానికి చూస్తే కేంద్ర, రాష్ర్టప్రభుత్వాలు నక్సలిజాన్ని అంతం చేయాలనే ధృడ సంకల్పంతో ఉన్నారని తెలుస్తోంది.

 

Exit mobile version