Site icon Prime9

Madhya Pradesh: పెను విషాదం.. బావిలో విషవాయువులు పీల్చి 8మంది మృతి

8 Died poisonous gas suffocation in well In Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. విషవాయువులు పీల్చి ఏకంగా 8 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని కొండావత్ గ్రామంలో పాడుబడిన ఓ బావిని విగ్రహాల నిమజ్జన కోసం శుభ్రం చేసేందుకు దిగారు. అయితే పేరుకుపోయిన బురదను తొలగిస్తున్న తరుణంగా విషవాయువులు వెలువడినట్లు స్థానికులు చెప్పారు.

 

అయితే, ఈ విష వాయువులను పీల్చిన ఐదుగురు బురదనేలల్లో మునిగిపోతుండగా.. వారిని కాపాడేందుకు మరో ముగ్గురు అందులోకి దిగారు. దీంతో మొత్తం ఎనిమిది మంది విషవాయువులు పీల్చి ప్రాణాలు వదిలారు. వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం అందించడంతో జిల్లా అధికారులతో పాటు పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి.

 

సుమారు నాలుగు గంటలపాటు శ్రమించి ఎనిమిది మంది మృతదేహాలను వెలికితీశారు. కాగా,ఆ బావి `50 ఏళ్ల పూరాతనమైందిగా గుర్తించారు. గ్రామంలో గంగౌర్ పండుగ వేడుకల్లో భాగంగా విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు గ్రామస్తులు బావిని శుభ్రం చేయాలని అనుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా బావిని శుభ్రం చేసుందుకు సిద్దమవ్వగా.. ఎనిమిది మంది కూలీలను మాట్లాడి పనులు ప్రారంభించారు. ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది.

 

ఇదెలా ఉండగా, ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

 

అలాగే, గుజరాత్‌లోని సుమ్రా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన నలుగురు పిల్లలతో కలిసి బావిలో దూకింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని చిన్నారులు రిత్విక్(3), ఆనంది(4), అజు(8), ఆయుష్(10) మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, చిన్నారుల తల్లి భానుబెన్ తోరియా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

Exit mobile version
Skip to toolbar