Modi Government: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు అయిన సందర్బంగా మే 30 నుంచి జూన్ 30 వరకు దేశ వ్యాప్తంగా వార్షికోత్సవ వేడుకలను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మొదట ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభతో ప్రారంభించాలని భావిస్తున్నారు.
ఐదు లోక్‌సభ నియోజకవర్గాలు ఒక క్లస్టర్ ..(Modi Government)
రాజస్థాన్, హర్యానా లేదా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో మోదీ సభ ఉండే అవకాశాలు ఉన్నాయి.. మోదీ బహిరంగ సభ సందర్భంగా థీమ్ సాంగ్‌ను లాంచ్ చేయనున్నారు. ఇది నెల పొడవునా అన్ని కార్యక్రమాలలో రీప్లే చేయబడుతుంది.250 లోక్‌సభ నియోజకవర్గాల్లో హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా మరియు ఇతర పార్టీ సీనియర్ నాయకులు ప్రసంగించడానికి యాభై ర్యాలీలు ప్లాన్ చేయబడ్డాయి. ప్రధాని మోదీ మరిన్ని ర్యాలీల్లో కూడా ప్రసంగించవచ్చు.నాలుగు నుంచి ఐదు లోక్‌సభ నియోజకవర్గాల క్లస్టర్‌ను ఏర్పాటు చేసి ఒక్కో క్లస్టర్‌లో ఒక ర్యాలీ నిర్వహిస్తారు.
జూన్ 23న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా, 10 లక్షల మందికి పైగా ప్రజలతో కనెక్ట్ అయ్యే డిజిటల్ ర్యాలీలో మోదీ ప్రసంగించనున్నారు.జూన్ 25న, దేశంలో ఎమర్జెన్సీ విధించి 48 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రసంగిస్తారు.