Trichy Airport: తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారులు ప్రయాణీకుడి ట్రాలీ బ్యాగ్‌లో 47 కొండచిలువలు, రెండు బల్లులను స్వాధీనం చేసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్నారు.
మలేషియాకు తిరిగి కొండచిలువలు..(Trichy Airport)
ఈ ప్రయాణీకుడిని మహమ్మద్ మొయిదీన్‌గా గుర్తించారు. బాటిక్ ఎయిర్ విమానంలో తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకోగానే కస్టమ్స్ అధికారులు మొయిదీన్‌ను అడ్డుకున్నారు. అతని బ్యాగ్‌లను గమనించిన అధికారులు, వివిధ రకాల మరియు పరిమాణాల కొండచిలువలను అనేక చిల్లులు గల పెట్టెల్లో దాచి ఉంచారు. అటవీశాఖ అధికారులు విమానాశ్రయానికి చేరుకుని 47 కొండచిలువలు,రెండు బల్లులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం కొండచిలువలను తిరిగి మలేషియాకు పంపించేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. విచారణ నిమ్మిత్తం మొయిదీన్‌ను అదుపులోకి తీసుకున్నారు.