Site icon Prime9

Vande Bharat trains: 2023 బడ్జెట్‌లో 400 కొత్త వందే భారత్ రైళ్లు

Vande Bharat train

Vande Bharat train

New Delhi: రాబోయే కేంద్ర బడ్జెట్‌లో సుమారు 300 నుండి 400 కొత్త వందే భారత్ రైళ్లను ప్రకటించవచ్చని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ 2024 మొదటి త్రైమాసికంలో స్లీపర్ కోచ్‌లతో కూడిన మొదటి వందే భారత్ రైలును విడుదల చేయనున్నట్లు చెప్పారు. రాబోయే మూడేళ్లలో 475 వందే భారత్ రైళ్ల ఉత్పత్తికి ప్రణాళికను రూపొందిచినట్లు చెప్పారు.

475 వందేభారత్ రైళ్ల లక్ష్యం, గత బడ్జెట్‌లో 400 రైళ్లు మంజూరు చేయగా అంతకు ముందు 75 రైళ్లు మంజూరు చేశారు. రానున్న మూడేళ్లలో పూర్తి లక్ష్యాన్ని చేరుకుంటాం అని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా మరియు ఇతర ప్రధాన మార్గాలలో ప్రస్తుతం ఉన్న రాజధాని మరియు దురంతో రైళ్ల స్థానంలో ఈ రైళ్లు వస్తాయా లేదా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

2025-26 నాటికి యూరప్, దక్షిణ అమెరికా మరియు తూర్పు ఆసియాలోని మార్కెట్‌లకు వందేభారత్ రైళ్లను ఎగుమతి చేసేందుకు భారతీయ రైల్వేలు ప్రణాళికలు వేస్తున్నాయని సీనియర్ అధికారి తెలిపారు.

Exit mobile version