Site icon Prime9

Madya Pradesh: మూఢ నమ్మకం.. 3 నెలల చిన్నారికి 51 సార్లు కాల్చి వాతలు

madya pradesh

madya pradesh

Madya Pradesh: ఓ వైపు దేశం సాంకేతిక రంగంలో దూసుకుపోతుంటే.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మూఢ నమ్మకాలు పోవడం లేదు. రోజురోజుకు ఎంతో అభివృద్ధి చెందుతున్నా.. కొన్ని విషయాల్లో ఇంకా వెనకబడే ఉన్నారు. వైద్య రంగంలో పెను మార్పులు సంభవించిన.. ఆధునిక చికిత్స అందుబాటులోకి వచ్చిన మూఢ నమ్మకాలు పోవడం లేదు. ఓ తల్లిదండ్రుల మూఢ నమ్మకానికి.. మూడు నెలల చిన్నారి బలైంది. ఈ ఘటన.. మధ్యప్రదేశ్‌ లో చోటు చేసుకుంది. వ్యాధి తగ్గాలంటూ ఇనుపరాడ్డుతో వాతలు పెట్టిన ఘటన అమానవీయ ఘటన మధ్యప్రదేశ్ Madya Pradesh లో జరిగింది.

 

చిన్నారికి 51 సార్లు కాల్చి వాతలు

వైద్య రంగంలో ఎన్నో మార్పులు వచ్చినా.. నాటు వైద్యం చేయించుకుంటూ ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు కొందరు.

తాజాగా ఇలాంటి ఓ ఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ Madya Pradesh లో మూడు నెలల పసికందు.. ఇలాంటి మూఢనమ్మకానికి బలైంది.

పాపకు వచ్చిన వ్యాధి తగ్గాలని.. 51 సార్లు ఇనుప రాడ్డుతో కాల్చి శరీరంపై వాతపెట్టారు.

అభం శుభం తెలియని ఆ చిన్నారి.. మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ఈ అమానుష ఘటన గిరిజన ప్రాబల్యం ఎక్కువగా ఉన్న షాదోల్‌ జిల్లాలో జరిగింది.

కథౌటియా గ్రామానికి చెందిన మూడు నెలల చిన్నారి.. నిమోనియా బారినపడింది.

శ్వాస ఇబ్బంది కావడంతో.. ఆస్పత్రికి వెళ్లకుండా స్థానిక మంత్రగాడి దగ్గరకు పాప తల్లిదండ్రులు తీసుకెళ్లారు.

వ్యాధి తగ్గాలంటూ.. చిన్నారి పొట్టపై కాల్చిన ఇనుపరాడ్డుతో 51 సార్లు వాతలు పెట్టారు.

ఆ తర్వాత పాప పరిస్థితి మరింత దిగజారడంతో.. ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పాప పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతు మృతి చెందింది.

సరైన సమయంలో చికిత్స అందకపోవడం వల్లే.. ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.

ఈ విషయం బయటకు రాకుండా.. చిన్నారి అంత్యక్రియలను హడావుడిగా పూర్తి చేశారు.

ఈ విషయం తెలుసుకున్న శిశు సంక్షేమ శాఖ అధికారులు.. చర్యలు చేపట్టారు. ఖననం చిన్నారి మృతదేహన్ని వెలికి తీసి.. పోస్టుమార్టం చేశారు.

ఘటనపై జిల్లా అధికారులు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గిరిజన ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో.. నిమోనియాకు ఇలాంటి చికిత్సలు సాధారణం.

 

గిరిజనుల్లో ఇంకా మూఢ నమ్మకాలు

దీనిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

గిరిజన ప్రాంతాల్లో మూఢ నమ్మకాలను తొలగించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

మూఢ నమ్మకానికి మూడు నెలల చిన్నారి బలి కావడం.. మధ్యప్రదేశ్ లో చర్చనీయంశంగా మారింది.

అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.

లోకేష్‌లో లీడర్ క్వాలిటీస్ లేవు యువగళం అట్టర్ ఫ్లాప్ | Lakshmi Partvathi Comments On Nara Lokesh

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar