Agra-Lucknow Expressway: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే పై బీహార్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్న బస్సు పాల ట్యాంకర్‌ను ఢీకొనడంతో 18 మంది మృతి చెందగా, 19 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా బంగార్‌మౌ ప్రాంతంలోని జోజికోట్ గ్రామ సమీపంలోని బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది.క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ..(Agra-Lucknow Expressway)
ఉన్నావ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉన్నావ్ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారికి రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి యాభై వేల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు