Site icon Prime9

KPCC president DK Shivakumar: నా వల్లే 135మంది ఎమ్మెల్యేలు గెలిచారు.. కేపీసీసీ అధ్యక్షుడు డికె శివకుమార్

KPCC president DK Shivakumar

KPCC president DK Shivakumar

 KPCC president DK Shivakumar: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడింది. సిఎం పదవి కావాలంటూ కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్, మాజీ సిఎం సిద్ధ రామయ్య పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న మాజీ సిఎం సిద్ధరామయ్య కాసేపట్లో రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. అధిష్టానం వైఖరి పట్ల ఆగ్రహంతో ఉన్న డికె శివకుమార్ కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. తన వల్లే 135మంది ఎమ్మెల్యేలు గెలిచారని బెంగళూరులో మీడియాతో మాట్లాడిన డికె శివకుమార్ చెప్పారు. ఒంటి చేత్తో పార్టీని గెలిపించానని, గతంలో 15 మంది ఎమ్మెల్యేలు పార్టీని వదిలి వెళ్ళినా తాను మాత్రం పార్టీని నమ్ముకునే ఉన్నానని డికె తెలిపారు.

ధైర్యం ఉన్న వ్యక్తి మెజారిటీ సాధిస్తాడు..( KPCC president DK Shivakumar)

నేను ఒక విషయాన్ని నమ్ముతాను. ధైర్యం ఉన్న వ్యక్తి మెజారిటీ సాధిస్తాడు. గత ఐదేళ్లలో ఏమి జరిగిందో నేను బహిర్గతం చేయను మేం పనిచేస్తామని కర్ణాటకను కాంగ్రెస్ పరం చేస్తామని లిఖితపూర్వకంగా సోనియాగాంధీకి హామీ ఇచ్చామని శివకుమార్ తెలిపారు. నిన్న 135 మంది ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని తెలియజేసి ఏకవాక్యతీర్మానం చేయగా, కొందరు తమ వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని అన్నారు. నా ప్రైవేట్ ప్రోగ్రాం ముగించుకుని నా దేవుడిని దర్శించుకుని ఢిల్లీ వెళతాను. మా హైకమాండ్ నన్ను మరియు మల్లికార్జున్ ఖర్గేను పిలిచింది అంటూ ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్న శివకుమార్ అన్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ కోసం సిద్ధరామయ్య ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు.

శివకుమార్ పార్టీ వ్యూహకర్త మరియు ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచగాసిద్ధరామయ్య మాజీ ముఖ్యమంత్రి మరియు రాష్ట్రంలోని అతిపెద్ద మాస్ లీడర్లలో ఒకరు.అయితే శివకుమార్ పై పలు అవినీతికేసులు విచారణలో ఉన్నాయి.సిద్ధరామయ్య కు క్లీన్ ఇమేజ్‌ ఉంది. వెనుకబడిన, అల్పసంఖ్యాక వర్గాల నేతగా ఆయన పేరుంది. మరోవైపు కీలకమైన వొక్కలిగ కుల సంఘాల మద్దతు శివకుమార్ కు ఉంది.కెపిసిసి ప్రధాన కార్యదర్శి, శివకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ సిద్ధరామయ్యకు ప్రతిపక్ష నాయకుడిగా మరియు తరువాత ముఖ్యమంత్రి పదవిని ఇచ్చింది. ఇప్పుడు డికె అత్యున్నత పదవిని కోరితే తప్పు ఏమిటి అంటూ ప్రశ్నించారు.

https://youtu.be/c0jNFQXTarg

Exit mobile version