Site icon Prime9

Tamil Nadu Floods: తమిళనాడు వరదల్లో 10 మంది మృతి.

Tamil Nadu floods

Tamil Nadu floods

Tamil Nadu Floods: దక్షిణ తమిళనాడు జిల్లాల్లో గత రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 10 మంది మృతి చెందినట్లు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివ దాస్ మీనా తెలిపారు.తిరునెల్వేలి, టుటికోరిన్ జిల్లాల్లో వర్షాల కారణంగా గోడ కూలి కొందరు, విద్యుదాఘాతంతో మరి కొందరు మరణించారని ఆయన తెలిపారు.

జాతీయ విపత్తుగా ప్రకటించాలి..(Tamil Nadu Floods)

తిరునల్వేలి మరియు టుటికోరిన్‌లలో రికార్డు స్థాయిలో వర్షపాతం మరియు వరదలు నమోదయ్యాయి.భారీ వర్షాల దృష్ట్యా తిరునెల్వేలి, తెన్‌కాసి జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. అదేవిధంగా తుత్తుకుడి జిల్లాకు కూడా సార్వత్రిక సెలవు ప్రకటించారు.ఈ జిల్లాల్లో భారీ వర్షం కారణంగా బుధవారం కూడా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దక్షిణ రైల్వే రద్దు చేసిన/పాక్షికంగా రద్దు చేయబడిన రైళ్ల జాబితాను విడుదల చేసింది.మిచౌంగ్ తుపాను, దక్షిణాది జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల సంభవించిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి విపత్తు సహాయ నిధిని అందించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వినతిపత్రం ఇచ్చారు.100 ఏళ్లలో దక్షిణాది జిల్లాల్లో అతివృష్టి వల్ల ఇంతటి నష్టం చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు.తక్షణ సాయం కోసం 7,300 కోట్లు, శాశ్వత సాయం కోసం రూ.12,000 కోట్లు అడిగాను. వరదల వల్ల నష్టపోయిన వారికి రూ. 6000 సాయంగా ప్రకటించాం. పంపిణీ చేస్తున్నారు. సహాయక చర్యలు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు.

తిరునెల్వేలి, తుత్తుకుడి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాయల్‌పట్నంలో 94 సెంటీమీటర్ల వర్షం కురిసిందని సీఎం స్టాలిన్ తెలిపారు. రెస్క్యూ మరియు రిలీఫ్ కోసం ఎనిమిది మంది మంత్రులు మరియు 10 మంది ఐఎఎస్ అధికారులను అక్కడికి పంపాము. 15 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మరియు 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు క్షేత్ర స్దాయిలో సహాయక చర్యల్లో ఉన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాలనుంచి 12,553 మందిని రక్షించి, 143 షెల్టర్లలో ఉంచారు. వరద ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్నారు. నాతో పాటు ప్రధాన కార్యదర్శి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.

Exit mobile version