Site icon Prime9

California Rain: కాలిపోర్నియాలో కుండపోత వర్షం ..జనజీవనం అస్తవ్యస్తం..

California Rain

California Rain

California Rain: అమెరికాలోని కాలిఫోర్నియాలో బుధవారం నాడు కురిసిన కుండపోత వానకు జనజీవనం అస్తవ్యస్తమైంది. పౌరులు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే విద్యుత్‌ కోతలు ఒక వైపు, మరో వైపు రోడ్లను మూసివేయడం జరిగింది. ఇక న్యూయార్కు విషయానికి వస్తే ఇక్కడ అంతా మంచుతో కప్పబడిపోయింది. అమెరికాలోని వెస్ట్‌కోస్ట్‌ రెండు దశాబ్దాల పాటు కరువుకోరల్లో చిక్కుకుపోయిన తర్వాత ఈ సారి మాత్రం భారీ వర్షాలు కురిశాయి. కాలిఫోర్నియాలోని ఆరెంజ్‌ కౌంటీలో జనజీవనం అతలాకుతలమైంది.

నిలిచిపోయిన విద్యుత్ సరఫరా..(California Rain)

కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ న్యూసోమ్‌ మాత్రం ఇక్కడ వాతావరణం అస్తవ్యస్తంగా ఉందన్నారు. కొన్ని నెలల క్రితం ఇక్కడ కార్చిచ్చు దహించి వేస్తే ఇప్పుడు వరదలతో సతమతమవుతున్నామన్నారు. అంతకు ముందు శీతాకాలంలో విపరీతమైన మంచు కురిసిందన్నారు. ఇదిలా ఉండగా కాలిఫోర్నియాలోని మొత్తం 58 కౌంటీలకు గాను 43 కౌంటీల్లో ఎమర్జెన్సీ విధించారు. సుమారు 1,30,000 వేల ఇళ్లకు, వ్యాపార సంస్థలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని గవర్నర్‌ అన్నారు.

అలాగే అట్మాస్పారిక్‌ రివర్‌ పొంగిపోర్లుతోందన్నారు అధికారులు. భారీ వర్షాలకు కొండిచరియలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చిస్తున్నారు. అలాగే మంచు కరిగిపోయి నీటి మట్టం పెరుగుతుందని చెబుతున్నారు. వాతావరణ శాఖ అధికారులు కూడా దక్షిణ కాలిఫోర్నియాలో భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.

గత ఏడాది డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది జనవరి రెండవ వారం వరకు సుమారు 20 మంది మృతి చెందారు. ఇటీవలి వరదలకు సుమారు నలుగురు చనిపోయారు. కాగా గవర్నర్‌ న్యూసోమ్‌ వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలు పజారో ప్రాంతంలో పర్యటించారు. కాగా ఈ పట్టణంలో సుమారు 2,000 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారిలో చాలా మంది లాటినోకు చెందిన వ్యవసాయ కార్మికులు అని చెబుతున్నారు.

లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు..(California Rain)

భారీ వర్షాలకు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారని మాంటెరరీ కంట్రీ షరీఫ్‌ టినా నీయిటో కాలిఫోర్నియా గవర్నర్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. భారీ వర్షాలకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని వారు అన్నారు.

మాంటెరెరీ కౌంటి విషయానికి వస్తే సుమారు 40 కిలోమీటర్ల తీర ప్రాంతంలో సాలినాస్ రివ్‌, హైవే 101 ప్రాంతం, ఇదంతా లోతట్టు ప్రాంతం ఇక్కడి పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోతట్టు ప్రాంతం కాబట్టి రోడ్లను కూడా మూసివేశారు.

భారీ వర్షాలకు వ్యవసాయం దెబ్బతింటుదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇక అమెరికాలోని ఈశాన్య ప్రాంతంలో శీతాకాలం సీజన్‌ ముగియడానికి ముందు భారీ మంచుకురుస్తోంది. పశ్చిమ మసాచుసెట్స్‌, నార్త్ వెస్ర్టన్‌ కనెక్టికట్‌, న్యూయార్కులోని హడ్సన్‌ వ్యాలీలో సుమారు రెండు అడుగుల మేర మంచుపేరుకుపోయింది.

మసాచుసెట్స్‌ మొత్తం మంచుతో కప్పబడిపోయింది. వెర్మెంట్‌ సరిహద్దులోని కోల్‌రెయిన్‌ ప్రాంతంలో మూడు అడుగుల ఎత్తులోమంచుకు పేరుకుపోయింది. అలాగే బోస్టన్‌ సరిహద్దులో సుమారు ఒక అడుగు ఎత్తులో మంచుతో కప్పబడిపోయింది.

కలోరెయిన్‌ పట్టణం అడ్మిస్ర్టేటర్‌ కెవిన్‌ ఫాక్స్‌ మాట్లాడుతూ తమ పట్టణంలో విద్యుత్‌ లేదని, సెల్‌ సర్వీసులు పనిచేయడం లేదని చెప్పారు. పట్టణం మొత్తం మూతబడిందన్నారు. విద్యుత్‌ ఎప్పుడు వస్తుందో ఏమో చెప్పలేమని కెవిన్‌ అన్నారు. మొత్తానికి అమెరికాలో ఈ ఏడాది అతి వృష్టి, అనావృష్లితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

 

Exit mobile version
Skip to toolbar