Site icon Prime9

Parliament Paid Tributes To Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణ‌ కు పార్ల‌మెంట్ నివాళి

Tribute

Tribute

Tributes To Superstar Krishna: ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణకు పార్లమెంట్ నివాళి అర్పించింది. పార్లమెంట్ శీతకాల సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభం అయ్యాయి. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే ఇటీవలి కాలంలో మరణించిన ములాయం సింగ్‌ యాదవ్‌ (సిట్టింగ్ ఎంపీ), మాజీ సభ్యులకు సంతాపం తెలిపింది. ఈ క్రమంలోనే గత నెలలో తుదిశ్వాస విడిచిన సూపర్ స్టార్‌ కృష్ణకు లోక్‌సభ సర్మించుకుంది. స్పీకర్ ఓం బిర్లా సంతాప సందేశం చదువుతూ.. ఏలూరు నుంచి లోక్‌సభకు ఎన్నికైన కృష్ణ.. తొమ్మిదోవ లోక్‌సభలో సభ్యునిగా ఉన్నారని గుర్తుచేశారు. ఆయన సూపర్ స్టార్ గా ప్రసిద్ధి చెందారని అన్నారు.

కృష్ణ 5 దశాబ్దాల కాలంలో 300కు పైగా సినిమాల్లో నటించారని చెప్పారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కంట్రిబ్యూషన్‌కు గానూ 2009లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్‌తో సత్కరించిందని అన్నారు. ఆయన నవంబర్ 15న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారని చెప్పారు. ములాయం సింగ్‌ యాదవ్‌తో పాటు 8 మంది మాజీ సభ్యుల మృతిపై సభ సంతాపం వ్యక్తం చేస్తుందన్నారు. దివంగత నేతలకు సంతాప సూచకంగా లోక్‌సభలో కొంతసేపు మౌనం పాటించి నివాళులర్పించారు.

Exit mobile version