Site icon Prime9

Janasena: జనసేనలో ’మెగాజోష్ ‘

mega josh

mega josh

Janasena:   పవన్‌కు నేనున్నా అంటూ చిరంజీవి బహిరంగంగా చేసిన ప్రకటన జనసేనలో ఫుల్‌ జోష్‌ పెంచేసింది. అన్నయ్య ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని జనసైనికులు కదన ఉత్సాహంతో ఉన్నారు. పవన్‌ కల్యాణ్‌ గట్టిగా ప్రయత్నిస్తే ‘చిరు’ సంకల్పం.. నెరవేరడం.. కష్టమేమీ కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు నేనున్నానంటూ మెగాస్టార్‌ చిరంజీవి ప్రకటించేశారు. అవసరం అనుకుంటే.. నేను అండగా ఉండొచ్చేమో! అని ఆయన వ్యాఖ్యానించారు. సో.. ఈ పరిణామం.. సహజం గానే జనసేనలో జోష్ నింపుతోంది. ఎందుకంటే.. ఇప్పటి వరకు `జనసేన` గురించి కానీ పవన్ రాజకీయాల గురించికానీ చిరు ఎక్కడా ఏ వేదికపైనా స్పందించింది లేదు. పైగా.. ఒకవైపు.. పవన్ ప్రభుత్వాన్ని తప్పుబడుతున్న సమయంలో ఆయన నేరుగా సీఎం జగన్‌ను కలవడం.. ఆయనతో కలిసి విందు ఆరగించడం.. వంటివి దుమారం రేపాయి.దీనిని బట్టి.. చిరంజీవి నిజంగానే రాజకీయాల నుంచి తప్పేసుకున్నారని కూడా.. ఓ వర్గం.. భావించింది. అంతేకాదు.. చిరు ఏం మాట్లాడినా.. దానిని తమకు అన్వయం చేసుకుని.. ముందుకు సాగిన వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. ఇలాంటి సమయంలో.. అనూహ్యంగా నేను.. అవసరం అనుకుంటే.. పవన్ వెనుక ఉండొచ్చేమో!! అంటూ.. చిరు వ్యాఖ్యానించడం.. జనసేనలో అనూహ్యమైన జోష్‌ను పెంచిందనే చెప్పాలి. పవన్ పాలనా పగ్గాలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నానని చిరంజీవి చెప్పడంతో మెగాభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది.

చిరంజీవి కామెంట్స్‌పై ఆయన పెద్ద తమ్ముడు జనసేన పార్టీ నేత నాగబాబు స్పందించారు. అన్నయ్య మాటలు తమకు ఎంతో భరోసానిచ్చాయని తెలిపారు. జనసేన పార్టీ నాయకులు, శ్రేణులు చిరంజీవి ఆకాంక్షను నెరవేర్చడానికి కష్టపడి పనిచేస్తామని చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా నాగబాబు ఒక ప్రకటనను పోస్టు చేశారు. భవిష్యత్‌లో తాను ఏ పక్షాన ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారని చిరంజీవి చెప్పిన మాటలకు అనుగుణంగా జనసైనికులంతా మరింత శ్రమించి ప్రజల మన్ననలు పొందాలని నాగబాబు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో చిరు తాజా ప్రకటన.. వల్ల.. జనసేనకు వచ్చే ఓటు బ్యాంకుపై అప్పుడే చర్చలు ప్రారంభమయ్యాయి. కాపు సామాజిక వర్గం.. గుండుగుత్తగా.. చిరంజీవి వెంట ఉందనే అభిప్రాయం ఉంది. ఆయనను ఇప్పటికీ అభిమానిస్తూనే ఉన్నారు. ఇక మాస్‌లోనూ.. మెగాస్టార్‌ ఫేమ్ ఎక్కడా తగ్గలేదు. అయితే..దీనిని రాజకీయంగా మార్చుకోవాల్సిన మలుచుకోవాల్సిన అవసరం ఉంది. అదేసమయంలో క్షేత్రస్తాయిలోనూ.. జనసేనను ముందుకు నడిపించేందుకు మరిన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంది. ఇది జరిగితే.. అప్పుడు.. జనసేనకు నిజంగానే మైలేజీ ఓట్లరూపంలో రాలడం ఖాయమని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

జనసేన నిలకడగా ముందుకు సాగుతోంది. ప్రజలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తోంది. చేసింది కూడా.. సమస్యలపై.. ప్రశ్నలు సంధించడంతోపాటు.. ఆయా సమస్యల పరిష్కారానికి.. నడుం బిగిస్తోంది. రహదారుల అంశాన్ని తీసుకుంటే.. గత ఏడాది అక్టోబరు 2న స్వయంగా రంగంలోకి దిగి.. రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. రాజధాని రైతుల పక్షాన అమరావతి కోసం నిలబడింది. నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కౌలు రైతుల ఆత్మహత్యలపైనా.. జనసేన స్పందించింది. వారి కుటుంబాలకు ఆర్తిక సాయం అందిస్తూ.. ప్రజల్లో నిలుస్తోంది.యువత అభిమానులను జనసేన వైపు మళ్లించే ప్రయత్నంలో సక్సెస్ అయితే.. ఇక తిరుగు లేదని.. చెబుతున్నారు. ప్రస్తుతం జనసేనకు 7 శాతం ఓటు బ్యాంకు ఉంది. చిరు ఫ్యామిలీ కలిస్తే.. ఇది 25 శాతం వరకు పరుగులు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో పవన్‌కు మెరుగైన దారి ఏర్పడడంతోపాటు.. అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఔను.. మెగాస్టార్ చిరంజీవి వ్యక్తం చేసిన.. సంకల్పం.. నిజస్వరూపం దాల్చడానికి పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు మెగా అభిమానులు.

Exit mobile version