KCR Driving: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు వైద్యుల సలహా మేరకు గురువారం ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో పాత ఓమ్నీ వ్యాన్‌ను నడిపారు. కొద్ది నెలల క్రితం కేసీఆర్ బాత్ రూమ్ లో జారిపడి తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే. అనంతరం యశోద ఆసుపత్రిలో తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ నేపధ్యంలో ఇటీవల ఆయన కర్ర లేకుండా నడుస్తున్నారు. దీనితో కేసీఆర్ ను మాన్యువల్ కారు నడపాలని వైద్యులు సూచించడంతో పాత ఓమ్నీ వ్యానును నడిపారు.
అభిమానుల హర్షం..(KCR Driving)
ఇటీవల పార్లమెంటు ఎన్నికల సందర్బంగా కేసీఆర్ బస్సులో పలు జిల్లాల్లో పర్యటించారు. రోడ్డు షోల్లో కూడా పాల్గొన్నారు. అయితే బయట నడిచినపుడు, బహిరంగ సభల వద్ద ఆయన చేతికర్ర సాయంతోనే నడిచారు. ఇపుడు కారు నడపడంతో బీఆర్ఎస్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సారు మరలా కారు నడుపుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.