Suicide Attempts: ఆత్మహత్య వద్దు… ఆనంద జీవితం ముద్దు…

నేడు ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా చావొక్కటే మార్గం కాదని.. సమస్యను అనేక కోణాలలో ఆలోచించి పరిష్కరించుకోవచ్చని చెప్తాదామా..

Suicide Attempts: లవ్‌ ఫెయిల్ అయ్యిందని.. ఫోన్ చూస్తుంటే తల్లిదండ్రులు మందలించారని… ఇంట్లో రిమోట్‌ ఇవ్వలేదని.. అనుకున్నట్లుగా మార్కులు రాలేదని, చదువుకోమని తల్లి మందలించిందని.. ఇలా ఏదో ఒక కారణంగా నిత్యం ఎందరో ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరి నేడు ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా చావొక్కటే మార్గం కాదని.. సమస్యను అనేక కోణాలలో ఆలోచించి పరిష్కరించుకోవచ్చని చెప్తాదామా..

ఆత్మహత్య చట్టరీత్యా క్షమించరాని నేరం అని చాలా మందికి తెలుసు. కానీ క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుని తణువు చాలిస్తుంటారు. తాము ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం ఉంటుందని తెలిసీ.. దాని గురించి ఆలోచించకుండా ఎందరో బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో ఎక్కువ మంది యువకులు, వృద్ధులు ఉన్నారని సర్వేలు చెప్తున్నాయి. ఆర్థిక, ఆరోగ్య సమస్యల ఒత్తిళ్లు, అభద్రతాభావంతో వృద్ధులు.. అపార ఒత్తిడితో యువత చనిపోతున్నారని నిపుణులు వెల్లడిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాల్లో చనిపోయే వారి కంటే ఆత్మహత్యల వల్ల మృతిచెందుతున్న వారి సంఖ్య పెరగడం బాధాకరం.

ఆలోచన ఎక్కడైతే అంతమవుతుందో.. అక్కడే క్షణికావేశం మొదలవుతుంది. దానితో ఇంక జీవితంపై విరక్తి మొదలవుతుంది. మద్యానికి బానిసవ్వడం, కుటుంబాన్ని పట్టించుకోకపోవడం వంటి పనులు చేస్తుంటారు.
ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలి. ఆత్మహత్య ఆలోచన కలిగి ఉన్న వ్యక్తులకు కౌన్సిలింగ్ ఇప్పించాలి. వారిని ఎప్పుడు నలుగురితో కలిసి ఉండేలా చూడాలి. వారి బాధలను అర్థం చేసుకుంటూ… సమస్యలను ప్రేమగా వినాలి. వారి సమస్యకు ఎలా పరిష్కారం దొరుకుతుందో వారితోనే చెప్పించాలి. వారెప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేలా చూసుకోవాలి. ఆత్మహత్య ఆలోచన ఉన్నవారి మైండ్‌లో నుంచి చెడు ఆలోచన బయటకు వెళ్లిపోయేలా కుటుంబసభ్యులంతా స్నేహంగా మెలగాలి. వారు సాధారణ జీవితం గడిపేంత వరకు వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి.

మానవజన్మ అనేది అత్యంత విలువైనదని దానిని సరిగ్గా వినియోగించుకుంటూ జీవితాన్ని ఆశ్వాధించాలే కానీ చిన్నచిన్న వాటికి భయపడి ఆత్మహత్యలు చేసుకుని అయినవారికి మానసిక క్షోభ కలిగించేందుకు కాదని గుర్తించిన నాడే ఈ ఆత్మహత్యల సంఖ్యను తగ్గించగలము. ఆ దిశగా మనమంతా కలిగి అడుగులు వేద్దాం.. ఆత్మహత్యలు లేని సమాజాన్ని నిర్మాణానికి కృషిచేద్దాం.

ఇదీ చదవండి: Honor Killing: మరో పరువు హత్య..