Site icon Prime9

Travel: ఇండియాలో వర్షాకాలంలో చూడవలసిన బెస్ట్ ప్లేసెస్ ఏమిటో తెలుసా?

భారతదేశంలోని వివిధ ప్రదేశాలల్లో సుందరమైన అందాలను అనుభవించడానికి వర్షాకాలం ఉత్తమ సమయాలలో ఒకటి. ప్రకృతిఅందాలకు నెలవైన ప్రదేశాలు ఎన్నో వున్నాయి. అయితే వీటిలో వర్షాకాలంలో చూడటానికి ఉత్తమమైన ప్రదేశాల్లో ముఖ్యమైనవి ఐదు వున్నాయి.

1. కూర్గు

వర్షాకాలంలో కర్ణాటకలోని కూర్గ్ తప్పక సందర్శించాలి. ప్రకృతి ప్రేమికులకు అనువైనదిగా పరిగణించబడే కూర్గ్  పచ్చని దట్టమైన అటవీ విస్తీర్ణానికి ప్రసిద్ధి చెందింది. వాస్తవానికి, ఇది అనేక రకాల వృక్షజాలం మరియు జంతుజాలాన్ని ప్రదర్శించే జీవవైవిధ్య హాట్‌స్పాట్‌గా కూడా  వుంది. ఈ రొమాంటిక్ గమ్యస్థానాన్ని తరచుగా హనీమూన్‌ జంటలు ఇష్టపడతారు. మంత్రముగ్ధులను చేసే జలపాతాలు, సరస్సులు, విస్తారమైన కాఫీ తోటలు రుచికరమైన వంటకాలను మరచిపోలేని అనుభూతిని మిగిల్చుతాయి.

2. గోవా

వర్షాకాలంలో చూడవలసిన ప్రదేశాల జాబితాలో గోవా అగ్రస్థానంలో ఉంది. ఈ సీజన్‌లో వాతావారణం బాగుంటుంది. గోవా వర్షాలలో తడిసిముద్దయ్యేందుకు, రుచికరమైన వంటకాలను ఆస్వాదించడానికి సరైన ప్రదేశం

3. మున్నార్

కేరళలోని మున్నార్ మ. ప్రకృతి ప్రేమికుల స్వర్గధామం. విశాలమైన తేయాకు తోటలు, పచ్చని కొండలు మరియు ఆహ్లాదకరమైన వాతావరణంతో, ఈ హిల్ స్టేషన్ నిజంగా దక్షిణ భారతదేశంలో వర్షాకాలంలో అత్యంత ఇష్టపడే పర్యాటక ప్రదేశాలలో ఒకటి. వర్షాకాలంలో  ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

4. షిల్లాంగ్

మేఘాలయలోని షిల్లాంగ్ వర్షాకాలంలో పర్యటించడానికి  మరొక అనువైన ప్రదేశం. షిల్లాంగ్‌ను ‘స్కాట్‌లాండ్ ఆఫ్ ఈస్ట్’ అని పిలుస్తారు.ఖాసీ మరియు జయంతి కొండల యొక్క సుందరమైన లోయలు, జలపాతాలతో షిల్లాంగ్ అందం  పర్యాటకులను ఆకర్షిస్తోంది.

5. స్పితి వ్యాలీ

హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీ ‘లిటిల్ టిబెట్’ అని కూడా ప్రసిద్ధి చెందింది. వర్షాకాలంలో సందర్శించడానికి అత్యుత్తమ  ప్రదేశాలలో ఒకటైన స్పితి ప్రకృతి ప్రేమికులకు మరియు సాహస ప్రియులకు అనువైన ప్రదేశం.

Exit mobile version