Chhattisgarh Blast: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరో సారి రెచ్చిపోయారు. దంతెవాడలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ దాడిలో 11 మంది పోలీసులు మృతి చెందారు. మరికొందరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. మృతులు డీఆర్‌జీ విభాగానికి చెందిన పోలీసులుగా గుర్తించారు.
ఛత్తీస్‌గఢ్ జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి)కి చెందిన భద్రతా సిబ్బంది దంతేవాడలోని అరన్‌పూర్ ప్రాంతంలో నక్సలైట్లు ఉన్నారని సమాచారం అందుకున్న తర్వాత అక్కడికి వెళ్లారు.వీరు ఆ ప్రాంతంలో మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల్లో ఉన్నారు.ఆ ప్రాంతం నుండి తిరిగి వస్తుండగా మందుపాతర పేలి 10 మంది సిబ్బంది మరియు వారు ప్రయాణిస్తున్న వాహనం డ్రైవర్ మరణించారు.
నక్సల్స్‌ను వదిలిపెట్టం..(Chhattisgarh Blast)
ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ స్పందిస్తూ దాడికి పాల్పడిన నక్సల్స్‌ను వదిలిపెట్టబోమని అన్నారు. ఇది చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ పోరాటం చివరి దశలో ఉంది. నక్సల్స్‌ను విడిచిపెట్టరు” అని బఘేల్ అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో మాట్లాడి దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి కేంద్రం పూర్తి మద్దతునిస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు.మరోవైపు దాడి ఘటనపై ఛత్తీస్‌గఢ్ ఐజీ సుంద్రాజ్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు.