Vijayawada Education News : సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ లో అపార అనుభవం కలిగిన కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ అయిన తక్షశిల ఐఏఎస్ అకాడమీ, విజయవాడలోని మేరిస్ స్టెల్లా కాలేజీతో కీలక పరస్పర అవగాహన ఒప్పందం (ఎం ఓ యూ)పై సంతకం చేసినట్లు తక్షశిల ఐఏఎస్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ బీఎస్ఎన్ దుర్గా ప్రసాద్ తెలిపారు. ఈ సంధర్భంగా స్టెల్లా కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “మేరీస్ స్టెల్లా కళాశాలతో ఈ ఎంఓయూ చేసుకోవడానికి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు.
బాలికలకు అపారమైన సామర్థ్యం, ప్రతిభ ఉందని, వారు అనుకున్న లక్ష్యాలను సాధించే దిశలో మేము తీసుకువస్తున్న ఈ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ ప్రోగ్రామ్ విద్యార్థులకు విద్యావిషయక జ్ఞానంతో పాటు ఆచరణాత్మక నైపుణ్యాలలో బలమైన పునాదిని అందిస్తుందన్నారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఎదుర్కొనే సవాళ్లను అధిగమించే దిశగా ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం వారిని సిద్ధం చేస్తున్నమన్నారు. తక్షశిల ఐఏఎస్ అకాడమీ భారతదేశంలో డిగ్రీ పట్టా అందించడంతో పాటు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లను అందించే ఏకైక అకాడమీ తక్షశిల అకాడెమీ అన్నారు.
యాజమాన్యాన్ని అభినందిస్తున్న పలువురు ప్రముఖులు (Vijayawada Education News) ..
మా సంస్థలో కోచింగ్ తీసుకున్న విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లో భాగంగా ప్రపంచలోని ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో అత్యధిక జీతంతో ఉద్యోగాలు సాధించారనీ, తద్వారా వారు గ్రాడ్యుయేట్లు కాక ముందే ఉద్యోగ అవకాశాలను పొందగలుగుతున్నారనీ వివరించారు. మారిస్ స్టెల్లా కాలేజీ ప్రిన్సిపల్ జెసింతా క్వాడ్రాస్ మాట్లాడుతూఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు తక్షశిల ఐఏఎస్ అకాడమీతో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు అత్యుత్తమ నాణ్యమైన కోచింగ్ తక్షశిలతో భాగస్వామ్యం కావడం మా విద్యార్థులకు గొప్ప అవకాశమన్నారు. సివిల్ సర్వెంట్లు కావాలనే వారి కలలను సాకార చేయడంలో మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నానన్నారు. అభివృద్ది చెందుతున్న ఏపీలో విద్యార్ధుల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళే శ్రమ లేకుండా విజయవాడ లోనే అందుబాటులోకే తీసుకొచ్చిన మెరిస్ స్టెల్లా కాలేజీ యాజమాన్యాన్ని పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/