Cambodia Victims: ఉద్యోగాల పేరుతో కాంబోడియాలో మోసపోయిన తెలుగు రాష్ట్రాలకు చెందిన బాధితులు శనివారం ఉదయం విశాఖ ఎయిర్ పోర్టుకు క్షేమంగా చేరుకున్నారు. విశాఖకు చెందిన 20 మందికిపైగా బాధితులు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కంబోడియా బాధితులకు విశాఖ నగర సీపీ రవిశంకర్ అయ్యర్ స్వాగతం పలికారు. కంబోడియా రాజధానిలో ఇప్పటికే 58 మందిని కాపాడి భారత్ కు పంపించింది అక్కడి ఇండియన్ ఎంబసి. కంబోడియా నుంచి ఢిల్లీకి చేరుకున్న బాధితులు అక్కడి నుంచి ఎయిర్ ఇండియా విమానంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. కంబోడియా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
బాధితులకు బాసటగా విశాఖ సీపీ..(Cambodia Victims)
కాంబోడియాలో చిక్కుకున్న విశాఖ బాధితులకు సీపీ రవిశంకర్ అయ్యనార్ బాసటగా నిలిచారు. కంబోడియాలో సైబర్ క్రైమ్ గ్యాంగ్ చేతిలో చిత్రహింసలకు గురైన వారిని విశాఖకు రప్పించడంలో అయ్యనార్ కృషి వుంది .అసలు కంబోడియాలో విశాఖ వాసులు ఎందుకు చిక్కుకున్నారు?బాధితులను రప్పించేందుకు అయ్యనార్ చేసిన ఆపరేషన్ ఏంటి?కంబోడియా సైబర్ క్రైమ్ గ్యాంగ్ నుంచి తప్పించుకుని వచ్చిన ఒక వ్యక్తి విశాఖ పోలీసులుకు అసలు విషయం చెప్పాడు . అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసారు పోలీసులు .దీనిపై సీపీ రవిశంకర్ అయ్యనార్ ప్రత్యేక దృష్టి సారించారు . విదేశీ ఉద్యోగాల పేరుతో కంబోడియా వెళ్లిన యువత మోసపోయినట్లు సీపీ అయ్యనార్ గమనించారు . దింతో భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపి కంబోడియా కేటుగాళ్ల చేతుల్లో చిక్కుకున్న బాధితులకు విముక్తి కల్పించారు. సీపీ రవిశంకర్ అయ్యనార్ ప్రత్యేక చొరవతో ఎట్టకేలకు కంబోడియా బాధితులు విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో భాదితులకు స్వాగతం పలికారు పోలీసులు.ఈ కేసులో ఇప్పటికే విశాఖకు చెందిన ముగ్గురు ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు.
డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో మోసం..
డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో 150 మంది నిరుద్యోగులు కాంబోడియా వెళ్లారు .వాళ్ళందరిని సైబర్ క్రైమ్ గ్యాంగ్ నిర్బంధించి వారి వీసాలు చించివేయడంతో ఆ కేటుగాళ్ల చెప్పిన పనులు చేయాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా కంబోడియా గ్యాంగ్ చేతిలో సుమారు 5వేల మంది చిక్కుకున్నట్లు దర్యాప్తులో తేలడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అన్ని రకాల లాంగ్వేజ్‌లు మాట్లాడేలా.. వివిధ రాష్ట్రాల వారిని తీసుకెళ్లి నిర్బంధించినట్లు వెల్లడైంది. పలు రకాల స్కామ్‌ల్లో ట్రైనింగ్ ఇచ్చి మనదేశంపైనే సైబర్ ఎటాక్ చేయిస్తుండడం సంచలనంగా మారింది.