Site icon Prime9

టీటీడీ ఈవో ధర్మారెడ్డి: టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి కన్నుమూత

TTD EO

TTD EO

TTD Eo Dharma Reddy : టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమారుడు చంద్రమౌళి మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చంద్రమౌళి నేడు తుదిశ్వాస విడిచారు. చంద్రమౌళికి ఇటీవలే ఆయనకు చెన్నై పారిశ్రామికవేత్త, టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయమయింది. ఈ నెలలో వివాహం జరగనుంది. దీనితో వివాహ ఆహ్వాన పత్రికలను బంధువులకు అందజేసేందుకు ఈ నెల 18న చెన్నై వెళ్లిన చంద్రమౌళికి అక్కడే గుండె నొప్పి వచ్చింది.

దీంతో బంధువులు వెంటనే ఆయనను చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. వెంటనే ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందించారు ఎక్మో ద్వారా చికిత్సను అందించారు. ఈ క్రమంలోనే చంద్రమౌళి నేటి ఉదయం 8.20 గంటలకు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. చంద్రమౌళి కళ్లను కుటుంబసభ్యులు ఐ బ్యాంకుకు దానం చేసారు. కర్నూలు జిల్లా నందికొట్కూరుకి మృతదేహాన్ని తరలించనున్నారు. ముంబయ్ లో ఉద్యోగం చేస్తున్న చంద్రమౌళి సివిల్స్ పరీక్షలకు సిద్దం అవుతున్నారు.

Exit mobile version