Fisherman:వేటకు వెళ్లి సముద్రంలో కొట్టుకుపోయిన ఓ మత్స్యకారుడు సుమారు 11 గంటల పాటు సముద్రంలో ఈత కొట్టి అటుగా వస్తున్న వేరే బోటు వారు రక్షించడంతో మృత్యుంజయుడుగా నిలిచాడు. దీనికి సంబంధించి వివరాలివి.
బోటునుంచి జారిపడి..(Fisherman)
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది వద్ద కాకినాడకు చెందిన మత్స్యకారుడు గేదెల అప్పారావు వేటకు వెళ్లి మంగళవారం రాత్రి బోటు నుంచి జారి పడిపోయి గల్లంతయ్యాడు.. అతడితోపాటు బోటులో ఉన్న మరో ఐదుగురు మత్స్యకారులు రాత్రి ఒంటిగంట సమయంలో అప్పారావు బోటులో లేకపోవడాన్ని గమనించారు.. దీనితో వెతకడం మొదలుపెట్టారు ఎంత వెతికినా కనిపించకపోవడంతో ఉదయం ఒడ్డుకు చేరారు.
అప్పటినుంచి తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఈదుతూ ఉన్న అప్పారావును అనకాపల్లి జిల్లా నక్కపల్లి రాజీవ్ పేటకు చెందిన మరో బోటు బుధవారం ఉదయం 10 గంటల సమయంలో గుర్తించి కాపాడారు.. కాకినాడకు చెందిన మత్స్యకారులకు అప్పారావును అప్పగించారు నరసాపురం వద్ద అతన్ని ఒడ్డు కు చేర్చి బోటుపై అంతర్వేది పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్ కు చేర్చారు.. వైద్యం నిమిత్తం రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.