Prime9

MP Raghuram Raju: ఫోన్ దాచేసి పోయిందంటూ నాటకాలు ఆడుతున్నారు..విజయసాయిరెడ్డిపై ఎంపీ రఘురామరాజు సెటైర్లు

Andhra Pradesh News: విజయసాయి రెడ్డి తన ఫోన్‌ పోయిందంటూ ఫిర్యాదు చేయడంపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు సెటైర్లు వేశారు. ఫోన్‌ ఆయనే దాచేసి పోయిందంటూ విజయసాయి నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో ఈడీ విచారణలో నిజాలు బయటకు రాకుండా ఇప్పుడే గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారంటూ చెప్పుకొచ్చారు. ఎల్బీ కోసమే ఫోన్‌ పోయిందంటూ నాటకాలు మొదలు పెట్టారంటూ ఫైర్‌ అయ్యారు.

ఎంపీ విజయసాయి రెడ్డి, సీఎం జగన్‌ల మీద పరోక్షంగా సెటైర్లు వేశారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు. ఇద్దరు నేతలు చెప్పే మాటలకు చేసే పనులకు అసలు పొంతన ఉండదన్నారు. ఇలాంటి వ్యక్తుల పాలనలో బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.విజయసాయి రెడ్డి తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విమర్శలకు దిగుతున్నారని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

విజయసాయి రెడ్డి కూతురిని దత్తత తీసుకున్ని విషయం నిజం కాదా అంటూ ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి తండ్రి 14 ఏళ్లు జైలులో ఉన్న విషయం నిజమా కాదా చెప్పాలంటూ ప్రశ్నించారు. తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారంటూ మండిపడ్డారు.

Exit mobile version
Skip to toolbar