Site icon Prime9

Janasena chief Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Pawan Kalyan

Pawan Kalyan

Janasena chief Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం మంగళగిరిలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాజా పరిణామాలతో ముందస్తు ఎన్నికలు రావచ్చనిపిస్తోందని అన్నారు.పదేళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడ్డామన్నారు. వైసీపీ దృష్టిలో రాజకీయం అంటే భయపెట్టడం, బెదిరించడమే నన్న పవన్ సామాన్యుడిని రాజకీయాల్లోకి రానివ్వకూడదని వైసీపీ భావిస్తోందన్నారు. పదవి ఉంది కదా అని ఎలా పడితే అలా ఉంటాం అంటే కుదరదు.
డబ్బు తీసుకుని సీట్లు ఇచ్చే సంస్కృతి జనసేనలో లేదు. కేవలం నా చుట్టూ తిరిగితే మీరు నాయకులైపోరని అన్నారు.

విశాఖలో వైసీపీకి ఒక్క సీటూ రాదు..(Janasena chief Pawan Kalyan)

రాజకీయాల్లోకి సినిమాను తీసుకురాకండని పవన్ కళ్యాణ్ సూచించారు.రాజకీయాలు నడిపేందుకు సినిమాలు నాకు ఇంధనం. రాజకీయ ఆధిపత్యాన్ని జగన్ వదులుకోరు. సాధికారత కోసం మనం అధికారాన్ని లాక్కోవాలి.వచ్చే ప్రభుత్వంలో జనసేన ఉంటుంది.సీఎం కాకూడదని నేను ఎప్పుడూ అనుకోలేదు. మంగళగిరి నా నివాస స్థానం.విశాఖలో ఒక్కసీటు కూడా వైసీపీకి రాదని పవన్ కల్యాణ్ అన్నారు. స్థానిక సమస్యలపై జనసైనికులు దృష్టి పెట్టాలన్నారు.ఎక్కడికక్కడ సమస్యలను స్థానిక నేతలే పరిష్కరించాలి.ప్రతి అంశానికి అధిష్టానంపైనే ఆధారపడకూడదు. రాజకీయాల్లో గుడ్‌విల్ అనేది చాలా ముఖ్యమని పవన్ పేర్కొన్నారు.

రాజకీయాల్లోకి యువత..

ఉద్యోగులకు పదవీ విరమణ ఉంటుంది. అలాగే రాజకీయాల్లోకి కొత్త వారిని రానివ్వాలని పవన్ అన్నారు. విలువలు ఉన్న వ్యక్తులను, యువతను మనం ప్రోత్సహించకపోతే ఎలా? సీనియర్ నాయకులు యువతను రానివ్వాలి. వయస్సులో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వస్తే ఏదైనా సాధించగలం.నడిపించే నాయకుడు క్షేమంగా లేకపోతే పార్టీని ఎలా నడపగలం?అందుకే రక్షణ గురించి మాట్లాడుతున్నానని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ గురించి 2 ఏళ్లుగా అధ్యయనం చేస్తున్నానన్న పవన్ అధ్యయనం చేయడం వల్లే బాగా మాట్లాడగలిగానని తెలిపారు.

Exit mobile version