Telugu Film Chamber of Commerce: హైదరాబాద్ లో తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. దిల్ రాజ్, సి.కళ్యాణ్ ప్యానెల్ మధ్య పోటీ జరగుతుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు. ఫిలిం ఛాంబర్ లో మొత్తం 1600 మంది సభ్యులు ఉండగా… 900 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
సి.కళ్యాణ్ vs దిల్ రాజు ప్యానల్ మధ్య తీవ్ర పోటీ జరుగుతోంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో మొత్తం 4 విభాగాలు ఉన్నాయి. వీటిలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో సెక్టార్లు ఉన్నాయి. ఇలాఉండగా ఫిలిం చాంబర్ ఎన్నికలు చూస్తే బాధ పడాలో లేక సంతోషించాలో అర్థం కావడం లేదని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన తమ్మారెడ్డి భరద్వాజ చాంబర్ ఎన్నికలు సాధారణ ఎన్నికలని తలపిస్తున్నాయని అన్నారు. వచ్చే ఎన్నికలకైనా పరిస్థితి మారాలని అన్నారు.దేనికి పోటిపడుతున్నారో, ఎందుకు కొట్టుకుంటున్నారో అర్థం కావడం లేదు.ఎలక్షన్స్ చూస్తుంటే సంతోషించాలో, ఏడ్వాలో తెలియట్లేదు.ఎలక్షన్ క్యాంపెయిన్ చూస్తే భయమేస్తోంది. ఇది ఉన్నోడికి, లేనోడికి మధ్య జరుగుతున్న పోటీలా ఉంది. ఇలాంటి ఎన్నికలు భవిష్యత్తులో జరగవద్దని కోరుకుంటున్నానని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.