Site icon Prime9

Bandi Sanjay : దేశద్రోహి ఎంఐఎం.. ఆ పార్టీకి ఓటు వేస్తారా? బండి సంజయ్

Bandi Sanjay

Bandi Sanjay

Union Minister Bandi Sanjay’s sensational comments AIMIM : శాసన మండలి ఎన్నికల్లో దేశద్రోహ ఎంఐఎం పార్టీకి, దేశభక్తి పార్టీ బీజేపీకి మధ్య యుద్ధం జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కరీంనగర్‌లో నిర్వహించిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేశద్రోహ పార్టీ ఎంఐఎంకు ఓటు వేస్తారా? లేక దేశభక్తి , సనాతన ధర్మం గురించి ఆలోచించే బీజేపీ పార్టీకి ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు. మజ్లిస్‌ను గెలిపించడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒక్కటయ్యాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని మజ్లిస్‌కు అప్పగించేందుకు పోటీ పడుతున్నాయని దుయ్యబట్టారు. అందుకే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌ను కేసుల నుంచి కాపాడేది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ-1కు తప్ప మిగతా వారందరికీ బెయిల్ వచ్చిందని గుర్తుచేశారు.

 

 

తెలంగాణను భ్రష్టు పట్టిస్తోన్న కాంగ్రెస్..
తెలంగాణలో పేదలకు ఉచితంగా రేషన్ బియ్యాన్ని బీజేపీ అందిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి లేదని ఆరోపించారు. కానీ కేంద్రం వెనకడుగు వేయకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తోందన్నారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిస్తోందన్నారు. ఆరు గ్యారంటీలను గాలికొదిలేసి ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. సీఎం, మంత్రులకు పాలనపై పట్టు లేకుండా పోయిందన్నారు. తెలంగాణలో రబ్బర్ స్టాంప్ సర్కారు నడుస్తోందని విమర్శించారు. మంత్రివర్గ విస్తరణ ఏఐసీసీ నిర్వహిస్తోందంటే రబ్బర్ స్టాంప్‌గా ఏ విధంగా మారిందో అర్థం చేసుకోవాలన్నారు.

 

 

తెలంగాణలో రబ్బర్ స్టాంప్ పాలన..
కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, కొన్ని సూచనలు తీసుకోవచ్చని, కానీ మంత్రివర్గ విస్తరణ నిర్ణయిస్తుందని పీసీసీ చీఫ్ చెప్పడం పాలన ఎవరి చేతిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో మంత్రుల కమిటీ వేశారని, మంత్రులు ఏమి చేయాలో పీసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ సూచనలు ఇస్తారని, దీంతో రబ్బర్ స్టాంప్ పాలన తెలంగాణలో కొనసాగుతోందన్నారు. సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ సర్కారు లేదని ఆరోపించారు. అవినీతి పాలన నడుస్తోందని, ఢిల్లీకి మూటలు పంపుతున్నారని, అన్నింట్లో కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. దేశంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి కొనసాగుతోందని ఆరోపించారు. దేశంలో 11 ఏళ్లుగా అవినీతి లేకుండా ప్రధాని మోదీ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం తీసుకొస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు.

 

 

Exit mobile version
Skip to toolbar