Site icon Prime9

TS Rains: తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్‌!

rains-in-andhra

rains-in-andhra

TS Rains: తెలంగాణలో అకాల వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయి. చేతికొచ్చిన పంట.. వడగళ్ల వానకు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులకు తీరని నష్టాన్ని మిగుల్చుతున్నాయి. గత రాత్రి కురిసిన వర్షానికి.. పలు ప్రాంతాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

మరో రెండు రోజులు వర్షాలు.. (TS Rains)

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్ల వాన కురిసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ వడగండ్ల వర్షంతో రైతులు పూర్తిగా నష్టపోయారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

ఈ జిల్లాలకు అలెర్ట్..

తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురవనుంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, హన్మకొండ, జనగాం, ఆదిలాబాద్‌, మంచిర్యాల.

పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతాయని వెల్లడించింది.
సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇక, ఆదివారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురిసింది.

అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురంలో 156 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. అలాగే కరీంనగర్‌, పెద్దపల్లి, మెదక్‌, సిద్ధిపేట, హన్మకొండ, వరంగల్‌, కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

రైతులకు తీరని నష్టం..

అకాల వర్షాలు.. రైతులకు ఆవేదన మిగుల్చుతుంది. పంట చేతికొచ్చే సమయంలో.. అకాల వర్షాలు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టిస్తోంది. పలు జిల్లాల్లో పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

 

Exit mobile version