Site icon Prime9

TSRTC: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ఆర్టీసీ

latest update on telangana assembly sessions and rtc bill

latest update on telangana assembly sessions and rtc bill

TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు మరో సారి డీఏ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్ లు వెల్లడించారు. జులై 2022 లో ఇవ్వాల్సి ఉన్న 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. జూన్ నెల వేతనంతో కలిపి డీఏను చెల్లించనున్నట్టు ప్రకటించారు.

 

 

ఉద్యమంలో క్రియాశీల పాత్ర(TSRTC)

‘తెలంగాణ ఉద్యమంలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు క్రియాశీల పాత్ర పోషించారు. 2011లో దాదాపు 29 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా పెండింగ్ లో ఉన్న 7 వ డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటివరకు 7 డీఏలను సంస్థ మంజూరు చేసింది. మిగిలి ఉన్న ఒక్క డీఏను త్వరలోనే ప్రకటిస్తుంది.’’ అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు.

 

Exit mobile version