Site icon Prime9

TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ ఛైర్మన్ తో సీఎం కేసీఆర్ కీలక భేటీ

TSPSC Paper Leak

TSPSC Paper Leak

TSPSC Paper Leak: తెలంగాణలో పరీక్షా ప్రశ్నపత్రాలు లీకేజీ వ్యవహారం కుదిపేస్తున్న నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఛైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం అయ్యారు.

శనివారం ఉదయం ప్రగతిభవన్‌కు వెళ్లిన జనార్థన్ రెడ్డి.. సీఎంతో భేటీ అయ్యారు. ఈ కీలక భేటీలో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి,

ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పేపర్‌ లీకేజీ వ్యవహారం, పరీక్షల నిర్వహణ, తదుపరి కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టు సమాచారం.

 

టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు?(TSPSC Paper Leak)

మరోవైపు ప్రశ్నాపత్రం లీకేజ్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ బోర్డు ఛైర్మన్ జనార్థన్ రెడ్డి తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.

అయితే బోర్డు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యమంత్రి సమావేశం అనంతరం కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, గ్రూప్ 1 ప్రిలిమనరీ పరీక్షను బోర్డు రద్దు చేసింది.

లీకేజీ వ్యవహారంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది టీఎస్పీఎస్సీ బోర్డు.

గ్రూప్1 తో పాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ), డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏవో) పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ను తిరిగి జూన్ 11 న నిర్వహించనున్నట్టు బోర్డు తెలిపింది.

ఇప్పటికే అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ), టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలను రద్దు చేశారు. తాజా నిర్ణయంతో మొత్తం 6 పరీక్షలను రద్దు చేసినట్టైంది.

సిట్ నివేదిక ఆధారంగా..(TSPSC Paper Leak)

పేపర్‌ లీకేజీ వ్యవహారంలో సిట్ నివేదిక ఆధారంగా.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్‌ 16వ తేదీన గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది.

ఈ ఏడాది జనవరి 22వ తేదీన ఏఈఈ, ఫిబ్రవరి 26వ తేదీన డీఏవో పరీక్షలు జరిగాయి. వీటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.

గత ఏడాది అక్టోబర్‌ 16వ తేదీన గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ఈ పరీక్ష ఫలితాలను జ‌న‌వ‌రి 13వ విడుద‌ల చేశారు.

503 గ్రూప్‌-1 పోస్టులకు మొత్తం 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు.

వీరిలో 2,85,916 మంది పరీక్షకు హాజరయ్యారు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌కు సంబంధించి మొత్తం 25,050 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

జూన్‌లో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ తొలుత భావించింది.

ఈలోపే లీకేజీ వ్యవహారం ప్రకంపనలు రేపడంతో.. ఇప్పుడు అదే జూన్‌లో మళ్లీ రీఎగ్జామ్‌ నిర్వహించాలని నిర్ణయించింది

 

Exit mobile version
Skip to toolbar