TSPSC paper leak: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలో రోజుకో కొత్తకోణం వెలుగుచూస్తోంది. ఒక్కొక్కరిగా ఇందులో ప్రమేయం ఉన్నవారు బయటకు వస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ విషయం అందరిని విస్మయానికి గురిచేస్తోంది. ఏఈ పరీక్షలో టాప్ వచ్చిన అభ్యర్ధి.. ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ సూత్రం చెప్పలేక దిక్కులు చూస్తు కూర్చున్నాడు.
ఏఈ పరీక్షలో టాప్.. (TSPSC paper leak)
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలో రోజుకో కొత్తకోణం వెలుగుచూస్తోంది. ఒక్కొక్కరిగా ఇందులో ప్రమేయం ఉన్నవారు బయటకు వస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ విషయం అందరిని విస్మయానికి గురిచేస్తోంది. ఏఈ పరీక్షలో టాప్ వచ్చిన అభ్యర్ధి.. ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ సూత్రం చెప్పలేక దిక్కులు చూస్తు కూర్చున్నాడు.
ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ అంటే ఏడో తరగతి చదివే విద్యార్థి సైతం ఠక్కున చేప్పేస్తాడు. కానీ ఏఈ పరీక్షలో టాపర్‌గా నిలిచిన అభ్యర్థి మాత్రం దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. దీంతోపాటు.. చిన్న ప్రశ్నలకు సైతం జవాబు చెప్పలేక సిట్ ఎదుట తెల్లమెుహం వేశాడు.
సబ్జెక్ట్ పై కనీస పరిజ్ఞానం లేకున్నా.. గణితం రాకున్న పోటీ పరీక్షలో టాపర్ గా నిలిచాడు. అడ్డదారిలో పేపర్ కొనుగొలు చేసి బుక్కయ్యాడు.
గ్రూప్1, ఏఈ, ఏఈఈ, డీఏవో తదితర పరీక్షల్లో టాపర్లను సిట్ పోలీసులు వేర్వేరుగా పిలిచి విచారణ నిర్వహించారు.
దీంతో వారు ఇచ్చే జవాబుల ఆధారంగా గుర్తిస్తున్నారు. ఓ యువకుడు ఏఈ పరీక్షలో టాపర్.
ఏ ప్లస్ బీ హోల్‌స్క్వేర్ వంటి లెక్కల్లో సులువైన ప్రశ్న అడిగితే తెల్లమొహం వేశాడు.
మరో అభ్యర్థి ప్రశ్నపత్రానికి సంబంధించిన జవాబులు వరుసగా రాసుకొని వచ్చి అడ్డంగా దొరికిపోయాడు. సమాధానాలు మర్చిపోయమంటూ.. నమ్మించే ప్రయత్నం చేశారు.
విద్యుత్‌శాఖ డీఈ?
ఈ కేసులో తవ్వినకొద్దీ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన ఓ విద్యుత్‌శాఖ డీఈ కనుసన్నల్లో పేపర్ మారినట్లు తెలుస్తోంది.
రవికిషోర్ అనే వ్యక్తి.. సుమారు 20 మందికి ఏఈ ప్రశ్నపత్రాలు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు సమాచారం.
డీఈ ఉద్యోగం చేస్తూనే.. ఈ దందా నడిపినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ముఠాలో ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.