Site icon Prime9

TS SSC Results: తెలంగాణ పదో తరగతి ఫలితాలొచ్చాయ్.. ఎలా చెక్ చేసుకోవాలంటే..

TS SSC Results

TS SSC Results

TS SSC Results: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను రిలీజ్ చేశారు. పదో తరగతిలో 86.6 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు మంత్రి వెల్లడించారు. వీరులో బాలురు 84.68 శాతం ఉత్తీర్ణత అవ్వగా.. బాలికలు 88.53 శాతం ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. ఆదిలాబాద్ చివరి స్థానం దగ్గింది.

రాష్ట్ర వ్యాప్తంగా 4,84,370 విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 4,19,000 మంది ఉత్తీర్ణులయ్యారు. 2793 స్కూళ్లలో వందకు వంద స్థానం ఉత్తీర్ణత నమోదు అయింది. 25 స్కూళ్లో జీరో శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. జూన్ 14 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. కాగా, ఫెయిలైన విద్యార్థులు తొందరపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.

 

తెలంగాణ పదో తరగతి పరీక్షలు ఫలితాల కోసం  http://results.bse.telangana.gov.in  వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తీర్ణత ఇలా..(TS SSC Results)

గురుకులాల్లో 98.25 శాతం ఉత్తీర్ణత.

ప్రభుత్వ పాఠశాలల్లో 72.39 శాతం ఉత్తీర్ణత

6163 మంది విద్యార్థులకు 10 పాయింట్స్.

మే 26 నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు అవకాశం

 

పక్కా ప్రణాళికతో..

కాగా.. ఏప్రిల్‌ 3 నుంచి 13 వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా 10 వ తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 4,84,370 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఈ ఏడాది 6 పేపర్లు కావడంతో వాల్యుయేషన్‌ ప్రక్రియను అధికారులు త్వరగా పూర్తి చేశారు. గతంలో మాదిరి ఫలితాల్లో తప్పులు దొర్లకుండా అధికారులు ట్రయల్ రన్ కూడా నిర్వహించినట్టు సమాచారం. రెండు, మూడు సార్లు వెరిఫికేషన్‌ చేసుకుని.. టెక్నికల్‌ ట్రయల్స్‌ను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇవన్నీ ఫైనల్ దశకు చేరుకోవడంతో బుధవారం ఫలితాలను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు.

 

Exit mobile version