Site icon Prime9

Rains: రాగల మూడు రోజులు వర్షాలు.. వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం

rain alert to costal Andhra

rain alert to costal Andhra

Rains: తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు.. 21 తేదీ నుంచి నాలుగు నుంచి ఐదు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

వర్షాలు.. మరోవైపు ఎండలు

తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు.. 21 తేదీ నుంచి నాలుగు నుంచి ఐదు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వాయవ్య తెలంగాణ.. గురువారం తూర్పు తెలంగాణలో ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ/ ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి గాలులు వీస్తున్నాయని పేర్కొంది.

భానుడి భగభగలు..

రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సుమారు 41- 44 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య.. గురువారం ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. 21వ తేదీ నుంచి 4, 5 రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఇక బుధవారం కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 43, 44 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మంగళవారం పలు జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో గరిష్ఠంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నిర్మల్ జిల్లాలో 44.8.. జగిత్యాల జిల్లాలో 44.8, ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హన్మకొండలో 44.7, అదిలాబాద్ లో 44.4, మంచిర్యాలలో 44.3 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెద్దపల్లి, భూపాలపల్లి, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 44.2, నల్గొండ జిల్లాలో 44.1, వనపర్తి జిల్లాలో 44 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

 

Exit mobile version