Site icon Prime9

LRS Date Extended : ఈ నెల 30 వరకు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపు గడువు పెంపు

LRS Date Extended

LRS Date Extended

LRS Date Extended : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌ఆర్‌ఎస్ పథకం రాయితీ గడువును మరోసారి పెంచింది. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం రాయితీ గడువు మార్చి 31తో ముగియగా, మరోసారి గడువును పెంచుతూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. గడువును ఈ నెల 30 వరకు పొడగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 30లోగా ఫీజు చెల్లింపు చేసిన వారికి 25 శాతం రాయితీ కల్పించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

 

 

లే అవుట్ల క్రమబద్ధీకరణ ద్వారా ప్రభుత్వానికి సుమారుగా రూ.వెయ్యి కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఎల్‌ఆర్‌ఎస్ పథకం ద్వారా అనధికార లే అవుట్లను క్రమబద్ధీకరించి నగర ప్రణాళికను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు మున్సిపాలిటీల పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌కు 15.27 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 15,894 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన దరఖాస్తుల్లో 6.87 లక్షలు ప్రాసెస్ అయినవి కాగా, 8.65 లక్షల దరఖాస్తులకు ఫీజు చెల్లింపు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

 

 

ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించిన దరఖాస్తులు 2.6 లక్షలుగా ఉన్నాయి. 58,032 దరఖాస్తులకు సంబంధించి అధికారుల ద్వారా ప్రోసీడింగ్స్ ఇచ్చినట్లు మున్సిపల్ శాఖ వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మరింత మంది లబ్ధి పొందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Exit mobile version
Skip to toolbar