Site icon Prime9

SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌కు బ్రేక్.. కారణం ఇదే?

SLBC Tunnel

SLBC Tunnel

SLBC Tunnel : ఎస్ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంలో 8 మంది గల్లంతు కాగా, ఇద్దరి మ‌ృతదేహాలను వెలికి తీసిన విషయం తెలిసిందే. ఆరుగురి మ‌ృతదేహాలు ఇప్పటి వరకూ ఆచూకీ లభించలేదు. ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. గల్లంతైన వారి కోసం 63 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. తాత్కాలికంగా రెస్క్యూ ఆపరేషన్‌కు బ్రేక్ పడింది. ఇద్దరి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీయగా, మిగిలిన ఆరుగురి కోసం తవ్వకాలు జరుపుతున్నారు. సొరంగంలో నిరంతరం పనిచేసిన ఎక్స్‌కవేటర్లు గురువారం బయటకు వచ్చాయి. శిథిలాల తొలగింపు దాదాపు పూర్తి కాగా, ప్రమాదకరమైన జోన్‌లో ఇంకా తొలగించాల్సి ఉందని అధికారులు తెలిపారు. సాంకేతిక కమిటీ సూచనల మేరకు సహాయక చర్యలను 3 నెలల పాటు నిలిపివేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టులో ఫిబ్రవరి 22వ తేదీన దుర్ఘటన సంభవించింది.

 

సాంకేతిక కమిటీ నిర్ణయం..
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యలను నిలిపివేయాలని సాంకేతిక కమిటీ నిర్ణయానికి వచ్చింది. టన్నెల్ ఇన్లెట్ వైపు నుంచి 13.6 కిలోమీటర్ల తర్వాత ముందుకెళ్లడం సురక్షితం కాదని కమిటీ స్పష్టం చేసింది. గురువారం జలసౌధలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అధ్యక్షతన సాంకేతిక కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఏపీలోని ఎన్‌డీఆర్‌ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్, నేషనల్ జియోఫిజికల్ పరిశోధనా సంస్థ డైరెక్టర్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్, నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ భూశాస్త్రవేత్త, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) నుంచి టన్నెల్ నిపుణులు పరీక్షిత్ మెహ్రా పాల్గొన్నారు. వారి సూచనల మేరకే నిర్ణయం తీసుకున్నారు.

Exit mobile version
Skip to toolbar