Telangana RTC Strike from May 6th 2025: తెలంగాణలో ఆర్టీసీ ప్రత్యేక్ష సమ్మెకు శంఖం పూరించింది. మే 6వ తేదీ నుంచి సమ్మె చేస్తామని ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్, లేబర్ కమిషనర్‌కు సమ్మె నోటీసులు అందజేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే మే 6వ తేదీన అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని జేఏసీ ప్రకటించింది. కాగా, జనవరి 27న తమ డిమాండ్లు పరిష్కరించాలని, లేకపోతే సమ్మెకు దిగుతామని ఇదివరకు ఆర్టీసీ సంస్థకు నోటీసులు ఇచ్చింది. సమ్మెకు నోటీసులు ఇచ్చినా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సమ్మె నిర్వహించేందుకు సిద్ధమైంది. సోమవారం లేబర్ కార్యాలయంలో సమావేశమైన నేతలు.. మే 6వ తేదీ నుంచి సమ్మె చేసేందుకు నిర్ణయించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే ఎంతదూరం అయినా వెళుతామని హెచ్చరించారు. తమ సమ్మెకు మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు, అన్ని యూనియన్లు కలిసి రావాలని వారు కోరారు.