Site icon Prime9

HCU Land Issue : హెచ్‌సీయూ భూములపై రాజకీయ రగడ.. బీజేపీ నేతల హౌస్ అరెస్టు

HCU Land Issue

HCU Land Issue

HCU Land Issue : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఇవాళ హెచ్సీయూకు వెళ్తామని బీజేపీ నేతల బృందం తెలిపింది. దీంతో హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. యూనివర్సిటీకి బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ సర్కారు భూముల అమ్మకానికి తెరలేపుతూ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కార్యక్రమానికి తెరలేపిందంటూ బీజేపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. రెండు రోజులుగా యూనివర్శిటీ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చాయి.

 

 

ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత..
ఇవాళ ఉదయం బీజేపీ ఎమ్మెల్యేలు హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి హెచ్‌సీయూకు బయలుదేరుతున్న క్రమంలో అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బీజేపీ ముఖ్యనేతలు ఎవరూ కూడా బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఉద్రిక్తత పరిస్థితుల మధ్య పోలీసులు బీజేపీ నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 

 

 

తరగతుల బహిష్కరణ..
నిధులను సంక్షేమ పథకాలకు వినియోగించే కార్యక్రమానికి సర్కారు శ్రీకారం చుట్టింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో ఇదే తరహా అంశానికి తెరలేపింది. అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను అమ్మే కార్యక్రమానికి తెరలేపిందని విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ బాటలోనే భూముల అమ్మకానికి తెరలేపారంటూ బీజేపీ పెద్దఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చింది. మరోవైపు యూనివర్సిటీ భూములపై విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థి సంఘాలు ఇవాళ తరగతుల బహిష్కరణకు పిలుపునిచ్చాయి. నిరసనలు ఉధృతం చేయాలని నిర్ణయించాయి.

 

 

హెచ్‌సీయూ వద్ద ఉద్రిక్తత..
మరోవైపు హెచ్‌సీయూ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీస్ గో బ్యాక్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భూముల వేలంపై ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఇంచు భూమి కూడా వదులుకోమంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

Exit mobile version
Skip to toolbar