Site icon Prime9

Dilsukhnagar Bomb Blast Verdict: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో రేపే హైకోర్టు తీర్పు!

Dilsukhnagar Bomb Blast

Dilsukhnagar Bomb Blast

Verdict out tomorrow on Dilsukhnagar Bomb Blasts Case: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో రేపు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. 2013లో జరిగిన పేలుళ్ల ఘటనలనో 18 మంది మ‌ృతి చెందగా, 130 మందికి గాయాలయ్యాయి. కేసు విచారణ జరిపిన ఎన్ఐఏ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్‌పాటు ఐదుగురికి మరణశిక్ష విధించింది. శిక్షను సవాల్ చేస్తూ ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు.

 

2013 ఫిబ్రవరి 21న హైదరాబాద్ నగరంలో రద్దీ ప్రాంతం దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లు సంభించాయి. ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) దర్యాప్తు చేసింది. విచారణలో 157 మంది సాక్షులను రికార్డు చేసింది. దర్యాప్తులో ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ప్రధాన నిందితుడిగా తేలింది.

 

నిందితుల్లో అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసీన్ అఖ్తర్, ఎజాజ్ షేక్, సయ్యద్ మక్బూల్ నిందితులుగా ఉన్నారు. మూడేళ్లపాటు ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగింది. విచారణ అనంతరం నిందితులకు మరణశిక్ష పడింది. ఈ కేసుతోపాటు పలు ఉగ్రదాడుల్లో కీలకంగా వ్యవహరించిన యాసిన్ భత్కల్‌ను 2013లో బీహార్-నేపాల్ సరిహద్దులో పట్టుకున్నారు. ఢిల్లీ (2008), దిల్‌సుఖ్‌ నగర్ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలడంతో తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.

 

Exit mobile version
Skip to toolbar