Site icon Prime9

Harish Rao : మాజీ మంత్రి హరీశ్‌రావుకు బిగ్ రిలీఫ్.. కేసు కొట్టివేత

Harish Rao

Harish Rao Big Relief : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌‌రావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌‌రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్‌టాపింగ్ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను ధర్మాసనం కొట్టివేసింది. పంజాగుట్ట పీస్‌లో ఫోన్ టాపింగ్ కేసు నమోదైంది. రియల్ వ్యాపారి చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఇద్దరిని నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే వాదనలు ముగియగా, ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఫోన్ ట్యాపింగ్‌ కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

 

ఫోన్‌ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన విషయం తెలిసిందే. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన రెండో ఎఫ్‌ఐఆర్‌‌‌ను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో హరీశ్‌రావు, రాధాకిషన్‌రావు వేసిన పిటిషన్‌పై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈ క్రమంలో రియల్ వ్యాపారి చక్రధర్‌గౌడ్ ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీసులు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేస్తూ న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌ఐఆర్‌లో హరీశ్‌రావుతో పాటు రాధాకిషన్‌రావును నిందితులుగా చేర్చారు. ఇప్పటికే ఇరు వాదనలు పూర్తవడంతో తీర్పును న్యాయస్థానం వెలువరించింది. ఇద్దరిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది.

 

 

బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తన ఫోన్‌ను ట్యాప్ చేసి, తనను ఇబ్బందులకు గురిచేశారని, వారితో తనకు ప్రాణహాని ఉందంటూ రియల్‌ వ్యాపారి చక్రధర్‌గౌడ్ కొంతకాలం కింద మీడియాతో మాట్లాడారు. చక్రధర్ ఇచ్చిన సమాచారం, సాక్షాలను ఆధారంగా చేసుకుని పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో సరైన ఆధారాలు లేవని హరీశ్‌రావు తరఫు లాయర్ వాదనలు వినిపించారు. హరీశ్‌రావు, రాధాకిషన్‌ వాదనలతో ఏకభవించిన హైకోర్టు పంజాగుట్టలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.

Exit mobile version
Skip to toolbar