Site icon Prime9

HCU Land Dispute Case: హైకోర్టులో కంచ గంచిబౌలి భూములపై విచారణ వాయిదా!

HCU Land Dispute

HCU Land Dispute

HCU Land Dispute Case postponed to 24th April 2025 by High Court: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదంపై సోమవారం హైకోర్టులో విచారణ వాయిదా పడింది. హై కోర్టు విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. భూ వివాదం అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని డివిజన్ బెంచ్ పేర్కొంది. కేసులో కౌంటర్, రిపోర్టు ఈ నెల 24లోగా సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. యూనివర్సిటీ భూముల వివాదంపై సుప్రీంకోర్టు, హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో హైకోర్టులో యూనివర్సిటీ భూములపై విచారణ జరిగింది. పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీం కోర్టులో కేసు విచారణ దశలో ఉన్నందున ఈ నెల 24కు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

 

24 లోపు కౌంటర్ దాఖలు చేయాలి..
ఈ నెల 24 లోపు ప్రభుత్వం, పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించారు. స్టేటస్ రిపోర్టు ఫైల్ చేసేలా సర్కారుకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది తన వాదనలు వినిపించారు. దీంతో ఫేక్ వీడియో, ఫారెస్ట్ తగులబెట్టిన వీడియోలపై ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్వెస్టిగేషన్ రిపోర్టుపై పోలీసులే కౌంటర్ దాఖలు చేస్తారని ప్రభుత్వం తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపడంతో తదుపరి విచారణ 24కు వాయిదా వేసింది.

 

పోలీసులు కేసు నమోదు..
కంచ గచ్చిబౌలి భూములపై ఏఐని ఉపయోగించి కొన్ని సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేయడంపై గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేశారు. అందులో భాగంగా బీఆర్‌ఎస్ పార్టీ నేత మన్నె క్రిశాంక్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కంచ గచ్చిబౌలి భూముల్లో ఏఐ ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు క్రిశాంక్‌కు పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ నెల 9, 10, 11న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. హెచ్‌సీయూ భూముల్లో ఏఐని ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్టు చేసినందున కొన్ని ఆధారాలతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణను కొనసాగిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar