Site icon Prime9

MLC election : హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ విడుదల

MLC election

MLC election : రాష్ట్రంలో మరో ఎన్నిక నగారా మోగింది. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు ఎలక్షన్ సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది. 1 మే 2025న పదవి పూర్తి కాబోతున్న ఎంఎస్ ప్రభాకర్‌రావు స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నిక జరగబోతున్నది. ఈ నెల 28న నోటిఫికేషన్ విడుదల చేసి ఏప్రిల్ 23న ఎన్నిక నిర్వహించనున్నారు. 25న ఫలితాలు లెక్కించనున్నట్లు ఈసీ పేర్కొంది. హైదరాబాద్ జిల్లాల్లో వెంటనే ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నట్లు ఈసీ పేర్కొంది.

 

 

సీటు ఎంఐఎం పార్టీకేనా?..
ఎమ్మెల్సీ స్థానం ఎవరికి దక్కబోతున్నదనేది ఆసక్తిగా మారింది. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో 3 కాంగ్రెస్‌కు ఒకటి సీపీఐకి, మరొకటి బీఆర్ఎస్‌ పార్టీకి దక్కాయి. ఆ సయమంలో తమకు సహకరించాలని కాంగ్రెస్ కోరింది. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీకి మద్దతు ఇస్తామని కాంగ్రెస్ ఎంఐఎంతో అవగాహనకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇదే నిజమైతే ఈ ఎన్నికలో కాంగ్రెస్ తమ అభ్యర్థిని బరిలో దించకుండా ఎంఐఎంకు మద్దతుగా నిలువాల్సి ఉంటుంది. బీఆర్ఎస్, బీజేపీ ఈ ఎన్నికలో ఎలాంటి పొలిటికల్ స్ట్రాటజీ అవలంభించబోతున్నారనేది ఆసక్తి రేపుతున్నది.

 

 

నోటిఫికేషన్ షెడ్యూల్..

నోటిఫికేషన్ విడుదల : 28 మార్చి 2025
నామినేషన్‌కు చివరి తేదీ : 4 ఏప్రిల్ 2025
నామినేషన్ల పరిశీలన : 7 ఏప్రిల్ 2025
నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు : 9 ఏప్రిల్ 2025
పోలింగ్ తేదీ : 23 ఏప్రిల్ 2025
ఓట్ల లెక్కింపు : 25 ఏప్రిల్ 2025

Exit mobile version
Skip to toolbar