Site icon Prime9

National Herald CASE : రాహుల్ ఇమేజ్ ఓర్వలేక మోదీ ప్రభుత్వం కుట్రలు : పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్

National Herald CASE

National Herald CASE

National Herald CASE : నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్‌షీట్‌లో చేర్చడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. గన్‌పార్క్ నుంచి బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. అనంతరం ఈడీ కార్యాలయం ఎదుట బైఠాయించిన నిరసన వ్యక్తంచేశారు. ధర్నాలో ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ నాయకులు హాజరయ్యారు.

 

దేశవ్యాప్తంగా బీజేపీ ఫాసిస్టు పాలన..
ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఫాసిస్టు పాలన కొనసాగిస్తోందని ధ్వజమెత్తారు. రాహుల్‌కు పెరుగుతున్న ఇమేజ్ ఓర్వలేక ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు అక్రమ కేసుల కుట్రలకు తెరలేపిందన్నారు. కాంగ్రెస్‌కు చెందిన నేషనల్ హెరాల్డ్‌కు రూ.90 కోట్లు రుణం ఇస్తే మనిలాండరింగ్ జరిగినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్రమ కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరగలేదన్నారు.

 

రాహుల్ ఇమెజ్‌ను బద్నాం చేసేందుకే..
మోదీ హవా తగ్గుతున్న కుట్రతో రాహుల్ ఇమెజ్‌ను బద్నాం చేసేందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నారని, గాంధీ కుటుంబం ఏనాడు కేసులకు భయపడలేదన్నారు. రాహుల్ ఒక ఫైటర్ అన్నారు. రాహుల్ దేశప్రజల గొంతుక అన్నారు. కుల గణనతో రాహుల్ గాంధీ మోదీకి రాజకీయ మరణ శాసనం రాశారని, బీహార్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే రాహుల్, సోనియాపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ఎన్నికలు రాగానే ప్రతి పక్షాలపై ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను వాడడం మోదీ, అమిత్ షాకు అలవాటుగా మారిందన్నారు. గుజరాత్‌లో ఏఐసీసీ సమావేశాలతో బీజేపీ నేతల్లో వణుకు మొదలైందన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు చేసిందని స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నవారు బీజేపీ పార్టీలో ఒక్కరైనా ఉన్నారా అని ప్రశ్నించారు.

 

 

Exit mobile version
Skip to toolbar