Site icon Prime9

White Ration Card : రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్.. ఉగాది నుంచి సన్నబియ్యం

White Ration Card

White Ration Card : తెలంగాణలోని తెల్ల రేషన్ కార్డు దారులకు కాంగ్రెస్ సర్కారు పండుగ లాంటి శుభ వార్త చెప్పింది. ఉగాది పండుగ నుంచి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఉగాది రోజున ఉమ్మడి నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో సన్నిబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఉగాది పండుగ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీసమేతంగా మటంపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజల అనంతరం సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తారు. మటంపల్లి ఆలయంలో పంచాంగ శ్రావణ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.

 

 

తెలంగాణలోని అన్ని రేషన్‌‌ దుకాణాల్లో ఉగాది పండుగ నుంచి సన్నబియ్యం పంపిణీని చేస్తామని మంత్రి ఉత్తమ్‌ వెల్లడించారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కారు కట్టుబడి ఉందన్నారు. రేషన్‌‌ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీని మటంపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. ఇందుకోసం స్థల ఎంపికకు చర్యలు తీసుకున్నామని, అన్ని వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తామన్నారు.

 

తెలంగాణలోని పేద, దిగువ మధ్య తరగతి వర్గాల కోసం చారిత్రక నిర్ణయం తీసుకునే దిశగా కాంగ్రెస్‌ సర్కారు అడుగులు వేస్తోంది. తెలంగాణలో ఆహార భద్రత కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికీ ఉగాది పండుగ నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. కుటుంబంలో ఎంత మంది ఉంటే ఒకొక్కరికీ 6 కిలోలు అందజేస్తారు. ఇప్పుడు పంపిణీ చేస్తున్న దొడ్డు రైస్ తినడానికి అనువుగా ఉండడం లేదు. రేషన్‌ కార్డుదారుల్లో 85 శాతం మంది దొడ్డు బియ్యాన్ని కిలోకు రూ.10 చొప్పున అమ్ముకుని, సన్న బియ్యం కొనుక్కుంటున్నారు. బియ్యాన్ని పాలిష్‌ చేసి, సన్న రైస్‌గా మార్చడం ద్వారా దళారులు భారీగా లాభపడుతున్నారు.

 

దీంతో రేషన్‌కార్డుదారులకు దొడ్డు బియ్యం బదులుగా సన్న బియ్యం ఇస్తే 100 శాతం మంది తినడానికి వినియోగించుకుంటారని సర్కారు భావిస్తోంది. అది కూడా ఉచితంగా ఇస్తే పేదలకు ఉపయోగకరంగా ఉండడంతోపాటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఆలోచన చేసింది. ఈ నిర్ణయంతో బహిరంగ మార్కెట్‌లో మంచి రకం సన్న బియ్యం ధరలు సైతం దిగొస్తాయని అంచనా వేస్తోంది. ప్రస్తుత వానాకాలంలో పండిన సూపర్‌ ఫైన్‌ బియ్యాన్నే రేషన్‌ దుకాణాల్లో పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Exit mobile version
Skip to toolbar