Prime9

High Court : తెలంగాణ హైకోర్టులో గ్రూప్‌-1పై విచారణ వాయిదా

Telangana High Court : గ్రూప్-1పై దాఖలైన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 30వ తేదీకి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. గ్రూప్-1 మెయిన్స్‌లో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లపై ఇవాళ ధర్మాసనంలో విచారణ జరిగింది. పరీక్షా కేంద్రాల కేటాయింపు, మూల్యాంకణంలో అక్రమాలు జరిగాయని పిటిషన్‌దారులు పేర్కొన్నారు. గత నెల అభ్యర్థుల పిటిషన్లపై వాదనలు కొనసాగాయి. పునఃమూల్యాంకనం లేదా మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని అభ్యర్థులు కోరారు. దీనికి సమాధానంగా నిపుణులతో మూల్యాంకనం చేయించామని అభ్యర్థులు అపోహపడుతున్నారని టీజీపీఎస్సీ తరఫున లయర్ వాదన వినిపించారు.

 

గ్రూప్-1 నియామకాలు ఆలస్యమైతే అభ్యర్థులు నష్టపోతారని పబ్లిక్ సర్వీస్ కమిషన్ న్యాయస్థానానికి వివరించింది. దీంతో ధ్రువపత్రాలు పరిశీలించవచ్చని కోర్టు ఆదేశించింది. గ్రూప్-1 నియామకాలపై స్టే ఎత్తివేయాలని నాలుగు పిటిషన్లను గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్థులు దాఖలు చేశారు. విచారణ సందర్భంగా స్టే వెకేట్ పిటిషన్లపై వాదనలు జరిగాయి. కౌంటర్ దాఖలు చేసేందుకు టీజీపీఎస్సీ, ఇతర లాయర్లు సమయం కోరారు. దీంతో విచారణ ఆలస్యమైతే ఎంపికైన వారికి ఇబ్బందులు ఉంటాయని, వినిపించిన వాదనలే మళ్లీ వినిపించవద్దని హైకోర్టు సూచించింది. తదుపరి వాదనలు ఈ నెల 30కి వింటామని విచారణను వరకు వాయిదా వేసింది.

Exit mobile version
Skip to toolbar