Site icon Prime9

TGSRTC Offer: టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఆ రూట్‌ ప్రయాణికులకు స్పెషల్ డిస్కౌంట్

VIJAYA Offers 10% Discount on Vijayawada Route: టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు స్పెషల్ డిస్కౌంట్ ప్రకటించింది. విజయవాడ రూట్‌లో ప్రయాణించే ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణికులు ఈ మార్గాల్లో దాదాపు 8 నుంచి 10శాతం వరకు చార్జీల్లో రాయితీ పొందవచ్చు.

ఈ రాయితీలో భాగంగా లహరి నాన్ ఎసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం, రాజధాని ఏసీ బస్సుల్లో 8 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. కావున ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. ముందుగా రిజర్వేషన్ కోసం టీజీఎస్ఆర్టీసీ వెబ్‌సైట్ WWW.TGSRTCBUS.INను సంప్రదించాలని చెప్పింది.

Exit mobile version
Skip to toolbar