Site icon Prime9

Vice Chancellor Ravinder Gupta: విద్యార్థినులతో కలిసి వైస్ చాన్సలర్ చిందులు

Vice-Chancellor-Prof-Ravinder-Gupta-Dance

Nizamabad: నిజామాబాద్ లోని తెలంగాణా వర్శిటీ వీసీ రవీందర్ గుప్తా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గణేష్ నిమజ్జనం తర్వాత గర్ల్స్ హాస్టల్ లో విద్యార్థినులతో కలిసి వీసీ చిందులేశారు. వీసీ డబ్బులు ఎగురవేస్తూ డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిన్న రాత్రి వినాయక నిమజ్జనం సందర్భంగా హాస్టల్ ఆవరణలో అమ్మాయిలు డీజే డాన్సులు చేశారు. విషయం తెలుసుకున్న వీసీ హుటాహుటిన హాస్టల్‌కు వెళ్లారు. బలవంతంగా గేటు తాళం తీయించి అమ్మాయిలతో కలిసి డాన్సు చేశారు. అంతేకాదు తనతో డాన్సు చేసిన వారికి డబ్బులను పంచారు. ఈ సందర్బంగా వీసీ రవీందర్ గుప్తా వెంట మరో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు సైతం ఉన్నారు.

రాష్ట్రంలో గత ఏడాది మే 22న యూనివర్సిటీలకు సర్కారు వైస్​చాన్సలర్లను నియమించింది. దీంట్లో భాగంగా తెలంగాణ యూనివర్సిటీకి ప్రొఫెసర్ రవీందర్​కు బాధ్యతలు అప్పగించింది. ఏళ్ల తరబడి ఇన్ చార్జి పాలనలో మగ్గిన తెలంగాణ వర్సిటీకి మంచిరోజులొచ్చాయని ఆశించిన ప్రొఫెసర్లు, స్టూడెంట్లకు నిరాశే మిగిలింది. ఆయన వచ్చినప్పటి నుంచి ఏవో వివాదాలు నడుస్తూనే ఉన్నాయని, అవన్నీ కూడా వీసీ చుట్టే తిరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియమాకం నుంచి రిజిస్టార్ల తొలగింపు వరకూ ఏదో వివాదం జరుగుతూనే ఉంది. వర్సిటీ అభివృద్ధి పై కాక వసూళ్ల పైనే వీసీ దృష్టి పెట్టారనే ఆరోపణలూ వస్తున్నాయి.

 

Exit mobile version