Site icon Prime9

UPSC Results: యూపీఎస్సీ ఫలితాల్లో సత్తాచాటిన తెలంగాణ విద్యార్ధులు

upsc telugu

upsc telugu

UPSC Results: యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. 2022కి సంబంధించిన ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఇక తొలి నాలుగు ర్యాంకుల్లో అమ్మాయిలే సత్తాచాటారు. దీంతోపాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కూడా మెరుగైన ర్యాంకులు సాధించారు.

సత్తాచాటిన తెలంగాణ విద్యార్ధులు (UPSC Results)

యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. 2022కి సంబంధించిన ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఇక తొలి నాలుగు ర్యాంకుల్లో అమ్మాయిలే సత్తాచాటారు. దీంతోపాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కూడా మెరుగైన ర్యాంకులు సాధించారు.

సివిల్స్ కొట్టిన వంటమనిషి కొడుకు..

ఆదిలాబాద్ కు చెందిన డోంగ్రి రేవయ్య అనే యువకుడు సివిల్స్ లో 410 ర్యాంక్ సాధించాడు. చిన్నపుడు తండ్రి చనిపోయాడు.

తల్లి ప్రభుత్వ పాఠశాలలో వంట మనిషిగా చేస్తూ.. కుమారుడిని బాగా చదివించింది. ఈ కష్టాలు.. ఆ యువకుడి అంకితభావం ముందు నిలువలేకపోయాయి. ఈ ర్యాంక్ తో తల్లి కలను సాకారం చేశాడు.

35 ర్యాంక్ సాధించిన యువకుడు..

కష్టపడితే సాధించలేనిది అంటూ ఏది లేదని నిరూపించారు మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు. దండెపల్లి మండలం.. కర్నాటిపేటకు చెందిన యువకుడు అజ్మీరా‌ సంకేత్ 35 ర్యాంకు సాధించాడు. తన కుమారుడు సివిల్స్‌ ర్యాంకు సాధించడంతో తల్లిదండ్రులు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. గ్రామస్తులు అజ్మీరా‌ సంకేత్‌ను అభినందించారు.

సత్తాచాటిన ఓరుగల్లు బిడ్డ..

సివిల్స్‌లో ఓరుగల్లు బిడ్డ తన ప్రతిభ కనబర్చాడు. హన్మకొండ అడ్వకేట్స్ కాలనీకి చెందిన శాఖమూరి సాయిహర్షిత్‌ 40వ ర్యాంక్ సాధించాడు.

22 సంవత్సరాల హర్షిత్‌.. ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్‌లో ర్యాంకు సాధించాడు.

జగిత్యాల యువకుడికి 132 వ ర్యాంకు..

సివిల్స్ లో కోరుట్ల మండలం ఐలాపూర్ కి చెందిన శివ మారుతీ రెడ్డి 132 ర్యాంక్ సాధించాడు.

ఈ మేరకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆ యువకుడికి శుభాకాంక్షలు తెలిపారు.

మూడో ర్యాంక్ సాధించిన ఎస్పీ కూతురు..

ఆల్ ఇండియా స్థాయిలో ఉమా హారతి మూడో ర్యాంక్ సాధించింది. ఈమె ఉమా హారతి నారాయణపేట జిల్లా ఎస్పీ కూతురు.

హైదరాబాద్ లో ఐఐటీ పూర్తి చేశారు. తర్వాత సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. సివిల్ సర్వీస్ లో నాలుగో ప్రయత్నంలో జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ సాధించారు.

94 ర్యాంక్..

కరీంనగర్ వాసి సాయికృష్ణ సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటారు. ఆల్ ఇండియా స్థాయిలో 94 వ ర్యాంక్ సాధించారు.

Exit mobile version