Site icon Prime9

Telangana Police: ఎస్ఐ, కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల

Telangana Police

Telangana Police

Telangana Police: తెలంగాణలో పోలీసు నియామక చివరి రాత పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఎస్సై, కానిస్టేబుళ్ల ఉద్యోగాల కోసం క్వాలిఫై అయిన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కానిస్టేబుల్‌ సివిల్‌, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్‌ పోస్టులకు 98,218 మంది అర్హత సాధించినట్టు తెలంగాణ స్టేట్‌ లెవెల్ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెల్లడించింది.

 

అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలు ఈ రోజు రాత్రి నుంచి వెబ్‌సైట్‌లో పెడతామని రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. ఫైనల్‌ కీ, ఓఎంఆర్‌ షీట్లను వెబ్‌సైట్‌లో ఉంచిన తర్వాత అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్‌లో చెక్‌ చేసుకోవచ్చని పేర్కొంది. జూన్‌ 1 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి జూన్‌ 3 వ తేదీ రాత్రి 8 గంటల వరకు అభ్యర్థులు రీ వెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 2000, ఇతరులకు రూ. 3000 ఫీజు నిర్ణయించింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో వివరాల తప్పులు సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పిస్తామని బోర్డు తెలిపింది.

పోస్టుల వారీ అర్హత సాధించిన అభ్యర్థులు

కానిస్టేబుల్‌ ఐటీ అండ్ కమ్యునికేషన్‌- 4,564
ఎస్సై సివిల్‌ – 43,708
ఎస్సై ఐటీ అండ్ కమ్యునికేషన్‌కు- 729
డ్రైవర్, ఆపరేటర్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు – 1,779
ఫింగర్‌ ఫ్రింట్‌ బ్యూరో ఏఎస్సై పోస్టులకు – 1,153
పోలీస్‌ ట్రాన్స్‌పోర్టు ఎస్సై పోస్టులకు- 463
పోలీస్‌ కానిస్టేబుల్‌ మెకానిక్‌కు – 283

 

Exit mobile version