Site icon Prime9

Telangana Formation Day : వైభవంగా “తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ” వేడుకలు..

telangana formation day celebrations details

telangana formation day celebrations details

Telangana Formation Day : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటీతో తొమ్మిది ఏళ్లు పూర్తి చేసుకొని 10 వ వసంతం లోకి అడుగు పెడుతుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అదే విధంగా సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వేడుకలను ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు దద్దరిల్లేలా ప్రతి రంగానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఆవిర్భావ వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 105 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది.

బీఆర్ఎస్.. 

అందులో భాగంగా ఈరోజు.. ఉదయం 10 గంటలా 20 నిముషాలకు అసెంబ్లీ దగ్గర ఉన్న అమరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళి అర్పించనున్నారు. నూతన సచివాలయంలో ఉదయం 10:30 గంటలకు సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి, దశాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తారు. హైదరాబాద్ లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు వేడుకల్లో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది.

భాజపా.. 

మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కొండ కోట వేదికగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌ రెడ్డి స్వయంగా వేడుకల ఏర్పాట్లను చూసుకుంటున్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా గోల్కొండ కోట వేదిక తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇక ఇప్పటికే కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆవిర్భావ ఉత్సవాలను ప్రారంభించారు.

 

 

కాంగ్రెస్.. 

మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వేడుకలను ఘనంగా చేపట్టనుంది. పదివేల మందితో హైదరాబాద్‌లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి గాంధీ భవన్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం గాంధీ భవన్ లో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ రానున్నారు.

21 రోజుల పాటు నిర్వహించనున్న దశాబ్ది ఉత్సవాలు (Telangana Formation Day)..

1వ రోజు – జాతీయ పతాకావిష్కరణ

2 వ రోజు  – తెలంగాణ రైతు దినోత్సవం

3 వ రోజు  – సురక్షా దినోత్సవం

4 వ రోజు  – తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం

5 వ రోజు – తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం

6 వ రోజు – సాగునీటి దినోత్సవం

7 వ రోజు  – ఊరూరా చెరువుల పండుగ

8 వ రోజు  – తెలంగాణ సంక్షేమ సంబురాలు

9 వ రోజు  – తెలంగాణ సుపరిపాలన దినోత్సవం

10 వ రోజు  – తెలంగాణ సాహిత్య దినోత్సవం

11 వ రోజు  – తెలంగాణ రన్

12 వ రోజు  – తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం

13 వ రోజు  – ‘తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం

14 వ రోజు  – తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం

15వ రోజు  – తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం

16వ రోజు  – తెలంగాణ గిరిజనోత్సవం

17వ రోజు  – తెలంగాణ మంచి నీళ్ల పండుగ

18 వ రోజు  – తెలంగాణ హరితోత్సవం

19 వ రోజు  – తెలంగాణ విద్యాదినోత్సవం

20 వ రోజు  – తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం

21వ రోజు  – అమరుల సంస్మరణ’ కార్యక్రమం.

 

Exit mobile version
Skip to toolbar