Site icon Prime9

Dharani portal: భూ పరిపాలన పోర్టల్ ధరణి చట్టానికి రెండేళ్లు

It has been two years since the Land Administration Porter Dharani Act came into force

Hyderabad: భూ పరిపాలన పోర్టల్ ధరణి ప్రజలకు అందుబాటులోకి వచ్చి రెండేళ్లు అయ్యాయి. తెలంగాణ ప్రజలకు సౌకర్యవంతమైన, సురక్షితమైన, అత్యాధునిక సిటిజెన్ ఫ్రెండ్లీ ఆన్ లైన్ పోర్టర్ ధరణిని 2020 నవంబర్ 2న ప్రభుత్వం చట్టాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చింది. గతంలో భూ రిజిష్ట్రేషన్లను 141 ప్రాంతాల్లోని సబ్ రిజిష్టార్ కార్యాలయాల్లో చేపట్టేవారు. ధరణి పోర్టల్ ద్వారా 574 మండల తహశీల్దారు కార్యాలయాల్లో కూడా భూ లావాదేవీలు నిర్వహించుకొనేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకొనింది.

రిజిస్ట్రేషన్ల అనంతరం భూములకు సంబంధించి రెవిన్యూ రికార్డుల్లో మ్యుటేషన్లు, ఈ-పట్టాదార్ పాస్ పుస్తకాలు వెంటనే అందుబాటులోకి రావడం, ఎస్.ఎం.ఎస్ ద్వారా ప్రజలకు సేవలు అందించడం జరిగింది. రిజిస్ట్రేషన్ జరిగిన వారం రోజుల్లోగా 18 సెక్యూరిటీ ఫీచర్లు కలిగిన పట్టాదార్ పాస్ పుస్తకం పంపిణీ అవుతుంది.

చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ధరణి పోర్టల్ ద్వారా 26 లక్షల లావాదేవీలు జరిగాయి. గతంలో 2 .97 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగినా మ్యుటేషన్లు జరగలేదు. ధరణి చట్టం ద్వారా వీటికి పరిష్కారం లభించింది. 2 .81 లక్షల గిఫ్ట్ డీడ్ లకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. పంట పొలాన్ని వ్యవసాయేతర భూమిగా సులభ బదలాయింపుకు కూడా ధరణి పోర్టల్ లో వెసులుబాటు కల్పించారు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రక్రియ ద్వారా పారిశ్రామికాభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు అనువైన మార్గం ఏర్పడింది. రైతు బంధు పధకానికి ధరణి పోర్టల్ ను అనుసంధానం చేసిన ప్రభుత్వం సంక్షేమాన్ని అందిస్తుంది.

ఇది కూడా చదవండి: Traffic Jam: నగర శివార్లలో భారీగా ట్రాఫిక్ జాం…చేతులెత్తేసిన పోలీసులు

Exit mobile version