Telangana CM Kcr: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే రోజు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. పారిశుధ్య కార్మికుల జీతం రూ. 1000 పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. శానిటైజేషన్ కార్మికులందరికీ నెల నెలా అందే జీతంతో పాటు తాజాగా పెంచిన రూ. 1000 కూడా అందుతుందని సీఎం ప్రకటించారు. తక్షణమే ఈ పెంపు అమలులోకి వస్తుందని వెల్లడించారు. కాగా, తాజా పెంపుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది కార్మికులకు లాభం చేకూరనుంది.
రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీలతో పాటు జీహెచ్‌ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్‌లో పని చేస్తూ ప్రస్తుతం జీతం అందుకుంటున్న పారిశుధ్య కార్మికుల వేతనాలు పెరగనున్నాయి. జీతం పెంపుపై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై పారిశుధ్య కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఆర్టీసీ కార్మికుల జీతాలను కూడా పెంచాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందకు తగ్గ చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖను ఆదేశించారు.
నూతనంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మొట్టమొదటి సమీక్షా సమావేశం నిర్వహించారు.
సుప్రీంకోర్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తాగునీటి పనులను కొనసాగించడానికి అనుమతించిన… pic.twitter.com/6B5iCkukHn
— Telangana CMO (@TelanganaCMO) May 1, 2023
కొత్త సెక్రటేరియట్ లో తొలి సమీక్ష(Telangana CM Kcr)
మరో వైపు కొత్తగా నిర్మించిన సచివాలయంలో సీఎం కేసీఆర్ మొదటి సారి పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తాగునీటి పనులను కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ సమీక్ష జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన పనుల పురోగతిపై సీఎం సమీక్షలో చర్చించారు. జులై వరకు కరివెన జలాశయంకు నీళ్లు తరలించాలని, ఆగస్ట్ వరకు ఉద్దండాపూర్ వరకు నీటిని ఎత్తిపోయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఉద్దండాపూర్ , వట్టెం, కరివెన, నార్లపూర్, ఏదుల, జలాశయాల మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలని.. విద్యుత్ సబ్ స్టేషన్లు, కన్వేయర్ సిస్టమ్, పంప్‌హౌస్‌ల లోని పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాలమూరు జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టెం పాడు, భీమా, కోయిల్ సాగర్ పనులకు సంబంధించిన పురోగతిపై కూడా చర్చించారు. మిగిలిన కొద్దిపాటి పనులను ఈ జూన్ లోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఇళ్ల క్రమబద్ధీకరణకు మరో నెల రోజులు
జీవో నెంబర్ 58, 59 కింద హైదరాబాద్- సికింద్రాబాద్ లో పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువును రాష్ర్ట ప్రభుత్వం మరో సారి పొడిగించింది. ఈ మేరకు నోటరీ స్థలాలను జీవో 58-59 ప్రకారం క్రమబద్ధీకరించుకునేందుకు మరో నెల రోజులు గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. నూతన సచివాలయంలో ఆయా శాఖల అధికారులతోె జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంలో సమస్యలు పరిష్కరించి హక్కులతో కూడిన పట్టాలు అందజేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఏక కాలంలో పేదల ఇళ్ల సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.