Telangana Budget 2023-24: ప్రజాసంక్షేమమే లక్ష్యంగా.. ప్రగతిశీల రాష్ట్రమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేలా.. వార్షిన బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీష్ రావు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అభివృద్ధిలో ముందుకు సాగుతున్న తెలంగాణపై కేంద్రం కావాలనే కక్షతో వ్యవహరిస్తుందని హరీష్ రావు ఆరోపించారు. కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించిన అభివృద్ధి ముందుకు సాగుతున్నామని తెలిపారు.
సాగునీటి రంగంలో స్వర్ణయుగం..
సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని మంత్రి హరీష్ రావు అన్నారు. సాగునీటి రంగంలో తెలంగాణ అధికంగా నష్టపోయిందన్నారు.
నాటి పాలనలో రైతులు అప్పుల బాధలతో ఆత్మహత్యల చేసుకున్నారని.. నేడు స్వరాష్ట్రంలో రైతులు ఆనందంగా బుక్కెడు బువ్వ తింటున్నారని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఇప్పుడు సాగునీటి రంగం స్వర్ణయుగాన్ని తలపిస్తున్నది వెల్లడించారు. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రం సస్యశ్యాలమంగా మారిందన్నారు.
ఆకలి కేకల నుంచి.. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా ఎదిగిందని హరీష్ రావు Minister Harish Rao వివరించారు.
వేసవిలో సైతం చెరువులూ, ఎత్తిపోతల ప్రాజెక్టులు జలకళతో కళకళాలాడుతున్నాయని తెలిపారు.
నదీజలాలూ, సాగునీటి రంగంలో తెలంగాణ అద్భుత విజయాలను సాధించిందని తెలిపారు.
మిషన్ కాకతీయ పథకంతో ఎంతో మేలు జరిగిందన్నారు. నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో.. మత్య్స సంపదకు ఊతం వచ్చిందన్నారు.
చెరువుల జలకళతో 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని మంత్రి తెలిపారు.
కేంద్రపై ఘాటు విమర్శలు..
ఓ వైపు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే.. కేంద్రం అడుగడుగునాఅడ్డంకులు సృష్టిస్తోందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం పెడుతున్న ఆంక్షలు, తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రాల హక్కులను హరిస్తున్నాయని మండిపడ్డారు.
రాష్ట్ర ఆర్థిక సామర్థ్యం మేరకు రుణ పరిమితిని రూ.53,970 కోట్లు పొందుపరచగా.. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రూ.15,033 కోట్లు కోత పెట్టిందని మంత్రి ఆరోపించారు.
కేంద్ర విద్యుత్ శాఖ బకాయిల చెల్లింపు విషయంతో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని మంత్రి ఆరోపించారు.
విద్యుత్తు సరఫరాకు సంబంధించి రూ.3,441.78 కోట్లను అసలు కింద.. రూ.3,315.14 కోట్లను వడ్డీ కింద లెక్క వేశారని వివరించారు.
ఈ మెుత్తం రూ.6,756.92 కోట్లను ఏపీజెన్‌కోకు 30 రోజుల్లోగా చెల్లించాలని కేంద్రం ఆదేశాలు ఇవ్వడం దారుణమని మంత్రి అన్నారు.
దీనికి సంబంధించి.. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.17,828 కోట్ల బకాయిలు ఇప్పించాలని కోరిన కేంద్రం కనికరించడం లేదని తెలిపారు.
ఈ విషయంలో కోర్టును ఆశ్రయించడం తప్పా మరో మార్గం లేదన్నారు.
ప్రతి పనిలో కేంద్రం మెుండిచేయి
రాష్ట్రం ఏర్పడిన కొత్తలో.. మనకు రావాల్సిన నిధులను కేంద్ర మంత్రిత్వ శాఖలు ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేశాయని ఆరోపించారు.
ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోవడం లేదని మంత్రి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ కు జమ చేసిన నిధులను.. తిరిగి సర్దుబాటు చేయకుండా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.
కేంద్రం సహకారం లేకున్నా.. గత ఎనిమిదిన్న ఏళ్లలో రాష్ట్రం సాధించిన గణనీయమైన అభివృద్ధి సాధించిందని మంత్రి వివరించారు.
పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక చొరవ..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసిందని మంత్రి వివరించారు.
కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్, మిడ్ మానేరు తదితర పెండింగ్ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేశామని తెలిపారు.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంతో.. 20 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చెక్ డ్యామ్ ల పై ప్రత్యేక చొరవ చూపింది.
1200 చెక్ డ్యామ్ ల నిర్మాణం చేపట్టగా.. అందులో 650 చెక్ డ్యాం ల నిర్మాణం పూర్తయింది. మిగతావి నిర్మాణంలో ఉన్నట్లు తెలిపారు.
ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసేవిధంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టను నిర్మిస్తుంది.
దాదాపు ఈ ప్రాజెక్టు 60శాతం పూర్తైనట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లకుండా.. కొందరు కుట్రపూరితంగా కేసులు వేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా.. 73 లక్షల 33 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు.
రానున్న మూడేళ్లలో మరో 50 లక్షల ఎకరాలను సారు నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/