Site icon Prime9

Telangana Assembly: బీఆర్ఎస్ లో ఉన్నపుడు బాగానే ఉన్నారు.. అటు వెళ్లి పూర్తిగా మారిపోయారు

ktr, Etela

ktr, Etela

Telangana Assembly: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. తెలంగాణ లో అభివృద్ది కార్యక్రమాల గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన కేంద్రప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలంగాణ దేశానికే ఆదర్శం నిలుస్తోందని.. కానీ రాష్ట్రాన్ని కించపరిచే విధంగా బీజేపీ విమర్శలు చేస్తోందన్నారు.

తెలంగాణ పల్లెలు అభివృద్ది పథంలో నడుస్తున్నాయన్నారు.

 

దుర్మార్గంగా మాట్లాడే ప్రధాని ఎక్కడా లేరు (Telangana Assembly)

ఈ సందర్భంగా కేటీఆర్ బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై మండిపడ్డారు. బీఆర్ఎస్ లో ఉన్నపుడు బాగానే ఉన్నారు కదా.. అటు వైపు వెళ్లి పూర్తిగా మారిపోయారని వ్యాఖ్యానించారు.

వైద్య రంగాన్ని బలోపేతం చేశామని.. ఆరోగ్యశాఖ మంత్రిగా చేసిన ఈ విషయం ఈటల కు తెలుసని అన్నారు.

తెలంగాణ అభివృద్ధి పై ఎఫ్ సీఐ, నాబార్డు ఇచ్చిన నివేదికలను కూడా నమ్మడం లేదా? అని ప్రశ్నించారు.

బీఆర్ ఎస్ రైతు రాజ్యం కావాలంటుంటే.. బీజేపీ మాత్రం కార్పోరేట్ రాజ్యం కావాలని అంటున్నారని  కేటీఆర్ విమర్శించారు.

రాష్ట్రంలోని రైతుబంధు పథకం అసాధారణమైన కార్యక్రమం అని కేటీఆర్ అన్నారు. 65 లక్షల మంది రైతులకు సీఎం కేసీఆర్ 65 వేల కోట్ల ను జమ చేశారన్నారు.

ప్రపంచంలోనే వినూత్న కార్యక్రమంగా రైతుబంధు ఉందని తెలిపారు. ఐక్యరాజ్య సమొతి కూడా ఈ పథకాన్ని ప్రశంసించిందని గుర్తు చేశారు.

రాజకీయాలు లేకుండా లబ్దిదారులందరికీ సాయం చేస్తున్నమన్నారు. నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతుల ప్రాణాలు తీసింది ఎవరు అని ప్రశ్నించారు.

దుర్మార్గంగా మాట్లాడే ప్రధాన మంత్రి ఎక్కడా ఉండరని ఎద్దేవా చేశారు. రైతుల పట్ల కేంద్రం కక్ష కట్టిందని ఆరోపించారు. గుజరాత్ లో పైకి బిల్టప్ తప్ప లోపల ఏమీ ఉండదన్నారు.

మన్ కీ బాత్ ని మంకీ బాత్ చేసిన కేటీఆర్..

కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ తనదైన శైలిలో విమర్శించారు. మోదీ లక్ష్యంగా పలు విమర్శలు చేశారు.

మోదీ నిర్వహించే మన్ కీ బాత్ ను కేటీఆర్ మంకీ బాత్ తో పోల్చారు. ఇందులో ప్రధాని సొల్లు వాగడం తప్పా.. దేశానికి పెద్దగా ఉపయోగపడింది ఏది లేదన్నారు.

ఐటీ రంగంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని.. ఐటీ కేంద్రానికి హైదరాబాద్ ఇప్పుడు అడ్డాగా మారిందని కేటీఆర్ గుర్తు చేశారు.

ఆకలితైనా ఉంటాం గానీ.. ఆత్మ గౌరవాన్ని చంపుకోమని అన్నారు. ఆత్మగౌరవం జోలికొస్తే సహించేది లేదని కేటీఆర్ అన్నారు. దేశ ప్రజల చూపు కేసీఆర్ వైపు ఉందని అన్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version